Begin typing your search above and press return to search.
మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ 75 రూపాయలే త్వరపడండి!
By: Tupaki Desk | 3 Sep 2022 1:30 AM GMTసినిమా టికెట్లను ఇష్టానుసారంగా పెంచుకోవచ్చని ప్రభుత్వాలు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చాయో అప్పుడే జనాలు థియేటర్ కు రావడం మానేశారు. నెల తర్వాత ఓటీటీలోకి వస్తుంది కదా అని ముఖం చాటేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను మాత్రమే థియేటర్లో చూస్తున్నారు. ఏమాత్రం తేడా కొట్టినా థియేటర్ కు రావడం లేదు. ఒక కుటుంబం మల్లీప్లెక్స్ లో సినిమా చూడాలంటే ఎంత లేదన్నా రూ.2వేలు ఖర్చు అవుతోంది. అంత భరించడం ఎందుకని జనాలే రావడం లేదు.
అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ లో 75 రూపాయలకే సినిమా చూసే అవకాశాన్ని థియేటర్ యజమానులు కల్పిస్తున్నారు. 150 రూపాయలకు పైగా ఉన్న టికెట్ ను సగం రేట్ కు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నా ఇదీ నిజం.
కాకపోతే ఇది కేవలం ఒక్కరోజు మాత్రమే. సెప్టెంబర్ 16న దేశంలో ‘నేషనల్ సినిమా డే’గా పాటిస్తున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్ ల సంఘాలన్నీ కలిసి ఈ సినిమా డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించాయి.
ఆ రోజు మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్లలో కేవలం రూ.75కే సినిమాను చూడొచ్చు. ఇది రాబోయే బ్రహ్మస్త్ర సినిమాకు గొప్ప వరంగ కానుంది. 16కు ముందు విడుదలయ్యే తెలుగు సినిమాలకు లక్కీ ఛాన్స్ గా మారింది. దీనివల్ల పేదలు, మధ్యతరగతి వారు కూడా మల్టీపెక్స్ లో సినిమా చూసే అవకాశం దక్కుతుంది.
ఇలా వారికోసమైనా నెలలో ఒకరోజు ఇలాంటి ప్రయత్నం చేస్తే సినిమాను అందరికీ చూపించినట్టు అవుతుంది. ఇలా థియేటర్ల సామాజికసేవ కూడా పూర్తవుతుంది.
ఈ దిశగా థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ లు కనుక నిర్ణయిస్తే సినీ పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లడం ఖాయం. అయితే ఈ రూ.75 టికెట్ కేవలం థియేటర్లలో కొన్నవారికే.. ఆన్ లైన్ లో అయితే జీఎస్టీ, మన్ను మషాణం అని టికెట్ రేటు పెరుగుతుంది. ఇక టికెటింగ్ వెబ్సైట్లు ఈ ఆఫర్ ను ఇస్తాయా? లేదా? అన్నది డౌటు. సో థియేటర్ కు వచ్చి కొంటేనే మీకు రూ.75 పడుతుందన్నమాట..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.