Begin typing your search above and press return to search.
ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేనా..?
By: Tupaki Desk | 11 Dec 2021 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు విషయంలో.. రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించడంతో చిత్ర పరిశ్రమ సమస్యలు ఎదుర్కొంటోంది. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని థియేటర్లలో 100 ₹ - మున్సిపాలిటీ పరిధిలో 60 ₹ - పంచాయతీ పరిధిలో 20 ₹ మించకుండా సినిమా టికెట్ ధరలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంత తక్కువ రేట్లతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్స్ అంటున్నారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల పెద్ద సినిమాలకు నష్టాలు తప్పని సినీ పెద్దలు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు చూడటానికి అసలు జనాలను థియేటర్లకు రప్పించడమే కష్టంగా మారిందని.. ఇలాంటి సమయంలో టికెట్ ధరలు తగ్గిస్తే నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.
RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య శనివారం మీడియా సమావేశంలో ఏపీలో సినిమా టికెట్ రేట్లపై మాట్లాడారు. 'ప్రభుత్వం సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు సినీ పరిశ్రమకి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఏపీ గవర్నమెంట్ సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించారు. అది నిర్మాతలకు వర్క్ అవుట్ కాదు. పెద్ద సినిమాలకు ఆ టికెట్ రేట్లు ఉంటే పెట్టిన డబ్బులు కూడా రావు' అని అన్నారు.
'ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పకుండా సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. సినిమా టికెట్ ధరల విషయంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఎక్కువ షోలు ప్రదర్శించే విధంగా మాట్లాడుతున్నాం. త్వరలోనే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం' అని దానయ్య చెప్పారు.
అలానే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని - రవిశంకర్ లు కూడా ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన టికెట్ ధరల ప్రభావం తప్పకుండా సినిమా వసూళ్లపై పడుతుందని అభిప్రాయపడ్డారు. కానీ అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి.. అన్ని సినిమాలకి వర్తించిన నిబంధనలే తమకూ వర్తిస్తాయని అన్నారు.
ఏషియన్ నిర్మాత నారాయణ్ దాస్ కె.నారంగ్ కూడా ఇటీవల ఏపీ సినిమా టికెట్ రేట్ల మీద మాట్లాడారు. సినిమాకి ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ మంచిదేనని.. కాకపోతే టికెట్ ధరలే ఇబ్బందికరంగా ఉన్నాయని అన్నారు. 'ప్రభుత్వంతో ఆ విషయంపై చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని నమ్ముతున్నాం. మన దగ్గర అత్యాధునిక హంగులతో థియేటర్లు నిర్మిస్తున్నారు. దానికి తగ్గట్లు కచ్చితంగా టికెట్ ధరలు పెంచాల్సిందే. ఆ ధరలు మరీ ఎక్కువ కాకూడదు.. తక్కువ కాకూడదనేదే మా అభిప్రాయం. ఏపీలో టికెట్ ధరలు మరీ తక్కువగా నిర్ణయించారు. అది నిర్మాతలకి కష్టంగా మారింది' అని నిర్మాత వివరించారు..
ఇదే క్రమంలో నిర్మాత సి. కళ్యాణ్ కూడా ప్రభుత్వ నిర్ణయం పై మరోసారి ఆలోచించాలని సూచించారు. 'టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా వస్తువు నేను తయారు చేసుకుని, నా వస్తువు రేటు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా వద్దా.. సినిమాను చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ మరీ ఇంతగా తగ్గించడం మాత్రం విచారించాల్సిన విషయం' అని అన్నారు.
'ఏదేమైనా ఏపీలో సినిమా టికెట్ ధరల సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరు. అదనపు షోలు - మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం. మళ్లీ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను' అని నిర్మాత కళ్యాణ్ అన్నారు.
ఇంతకుముందు చిరంజీవి - సురేష్ బాబు - రాఘవేంద్రరావు వంటి పలువురు సినీ పెద్దలు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. టికెట్ రేట్ల విషయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. 'దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా టికెట్ ధరల్ని కాలానుగుణంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరల్లో అదే వెసులుబాటు ఉండటం సమంజసం' అని చిరంజీవి పేర్కొన్నారు.
అలానే డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. ఇప్పుడున్న రేట్లతో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని.. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని అన్నారు. 'మార్కెట్లో వస్తువుని బట్టి ఒక్కో రేటు ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని వస్తువుల్ని కలిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా కుదురుతుంది. పెద్ద సినిమాల బడ్జెట్ వేరు.. చిన్న సినిమాల బడ్జెట్ వేరు. రెండు సినిమాలకూ ఒకే రేటు నిర్ణయించడం సరైన నిర్ణయం కాదు. ఇలాగైతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు భారీగా నష్టపోతారు' అని సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఆంద్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై ఓ నోట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు - ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ - ప్రొడ్యూసర్స్ అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని.. ప్రస్తుతం టిక్కెట్ ధరలు - షోల నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
ఇప్పటి వరకు మాట్లాడిన సినీ ప్రముఖులు అందరూ సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన ధరలతో నిర్మాతలు భారీగా నష్టపోతారని చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం పునరాలోచించి, టికెట్ ధరల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తుందేమో చూడాలి.