Begin typing your search above and press return to search.
సినిమా టికెట్ ధరలు: జీవో నెం.35 రద్దుపై క్లారిటీ..!
By: Tupaki Desk | 20 Dec 2021 1:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పంచాయితీ హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 35ను రద్దు చేస్తూ గతవారం సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. సోమవారం దీనిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టికెట్ రద్దు జీవోపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది.
సినిమా టికెట్ రేట్లపై జారీ చేసిన జీవో నెం.35 రద్దు అంశం పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని.. రేట్లు నిర్ణయించుకునే అధికారం వారికి మాత్రమే ఉంటుందని గత విచారణ సందర్భంగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే ఈ వ్యవహారం పై సోమవారం హైకోర్టులో మరోసారి విచారణ జరుగగా.. రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు జీవో నంబర్ 35 రద్దు వర్తిస్తుందని ప్రభుత్వం తరపున అడిషనల్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఏజీ చెప్పారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల టికెట్ రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశం ఉంటుందని హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇక ధరల పెంపుపై ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్లకు పంపాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. అడిషనల్ అఫిడవిట్ లో ఆ వివరాలు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టికెట్ ధరల నియంత్రణపై కమిటీ ఏర్పాటు చేశామని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి మరికొంత సమయం కావాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. దీనికి గడువిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరి జీవో నెం.35 విషయంలో ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తుందా? లేదా గతంలో సింగిల్ జడ్జి తీర్పును సమర్ధిస్తుందా? అనేది చూడాలి.
ఇదిలా ఉంటే సినిమా టికెట్ ధరల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35 రద్దు అయినా.. జాయింట్ కలెక్టర్ల అనుమతి తీసుకున్న తరువాతే థియేటర్ యజమానులు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.