Begin typing your search above and press return to search.

దేవిశ్రీ కోసమేనా ఆ టైటిల్?

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:38 AM GMT
దేవిశ్రీ కోసమేనా ఆ టైటిల్?
X
సినిమాకి టైటిల్ చాలా ముఖ్యం. టైటిల్ తో సగం హిట్ కొట్టేసే సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే వీటి విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటారు మూవీ మేకర్స్. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో నవంబర్ లో రిజిస్టర్ అయిన కొన్ని టాలీవుడ్ మూవీ టైటిల్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ ఎస్ వీ క్రియేషన్స్ పై "ఫీల్ మై లవ్" అనే రిజిస్టర్ అయింది. ఆర్య మూవీ తర్వాత ఫీల్ మై లవ్ అనే సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో మనకు తెలుసు. ఇంతటి ఫీల్ ఉన్న టైటిల్ ని దిల్ రాజు ఎవరి కోసం రిజిస్టర్ చేయించి ఉంటాడనే ఆలోచన కలుగుతోంది. సుకుమార్ డైరెక్టర్ గా, దేవిశ్రీ ప్రసాద్ హీరోగా రాజు ఓ మూవీ నిర్మిస్తానని చెప్పాడు. బహుశా దీనికోసమే "ఫీల్ మై లవ్" టైటిల్ ని రిజిస్టర్ చేయించి ఉండాడని టాలీవుడ్ అనుకుంటోంది.

ఇక ఎస్వీ క్రియేషన్స్ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ "ఆరడుగుల బుల్లెట్", ప్రభాస్ హోం బ్యానర్ గోపీ కృష్ణ మూవీస్ "దంధా", గుణశేఖర్ "గోన గన్నారెడ్డి", క్రిష్ "రాయబారి" టైటిల్స్ ని రిజిస్టర్ చేయగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై.. మంచు విష్ణు "గరుడ" అనే టైటిల్ ని రిజిస్టర్ చేశాడు. గరుడ అనే పేరుతో రాజమౌళి భారీ చిత్రాన్ని తీస్తాడని అనుకుంటున్న సమయంలో.. ఈ టైటిల్ ని విష్ణు రిజిస్టర్ చేయించడం ఆసక్తి కలిగించే విషయం.