Begin typing your search above and press return to search.
దర్శకుడిని అనకూడని మాటలు
By: Tupaki Desk | 4 Dec 2018 2:30 PM GMTగత కొంతకాలంగా టాలీవుడ్ లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక జాతీయ అవార్డు సినిమా తీసిన దర్శకుడుని ఓ అగ్రకథానాయిక బండ బూతులు తిట్టిందనేదే ఆ చర్చ వెనక సారాంశం. ఆ తిట్లు, చిరాకులు, పరాకుల క్రమంలోనే ఆ దర్శకుడు ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి మిడిల్ డ్రాప్ అయ్యారు. అయినా మేకర్స్ ఏదోలా తంటాలు పడి చివరికి ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. అందుకోసం ఓ కుర్ర దర్శకుడి తో ప్రాజెక్టుని మమ అనిపించారు. అయితే ఆ గొడవ అప్పటి కైనా సద్ధుమణిగిందా? అంటే లేనే లేదని చెప్పుకుంటున్నారు.
సదరు దర్శకుడిని ఆ హీరోయిన్ నానా మాటలు అనడం తో అదో అంతూ దరీ లేని వివాదం అయ్యింది. ఆ హీరోయిన్ బండ బూతులు తిట్టి, అనకూడని మాటలు అందన్న ప్రచారం సాగుతోంది. ఆ అనకూడని మాట వల్లనే ఆ ఇద్దరి మధ్యా గొడవలు పీక్స్ కి చేరాయి. అది ఏకంగా ప్రాజెక్టుకే తంటాలు తెచ్చిపెట్టింది. దీంతో ఆ సినిమాని డైరెక్టర్ లేని ఏకైక సినిమాగా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సినిమా టైటిల్స్ లో ఆ తప్పుకున్న దర్శకుడి పేరు కానీ, చివరిలో ముగింపునిచ్చిన దర్శకుడి పేరు కానీ టైటిల్స్ లో వేయడం లేదట. టాలీవుడ్ 85 ఏళ్ల హిస్టరీలో దర్శకుడే లేని సినిమా ఇదన్న మాటా ప్రస్తుతం వేడెక్కిస్తోంది.
గత కొంతకాలంగా వింటున్నదే అయినా..ఆ సినిమా ఎప్పుడొస్తుంది? నెక్ట్స్ ఏంటి? అంటూ మాట్లాడుకుంటున్నారు. సదరు కథానాయిక నెక్ట్స్ ఓ భారీ హిస్టారికల్ చిత్రంలోనూ నటిస్తోంది. తమిళంలో ఓ యువహీరో సరసన అవకాశం అందుకుంది ఈ అమ్మడు. అన్నట్టు తన కెరీర్లో తొలిసారి ఇలాంటి వివాదం రాజుకోవడంతో ఇది పంటికింద రాయిలా తనను చాలా ఇబ్బంది పెడుతోందని తెలుస్తోంది. తనచుట్టూ ఉన్నవాళ్లే తనపై చెడు ప్రచారం చేసేంతగా పరిస్థితి దిగజారిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వివాదంలో సదరు కథానాయిక వెర్షన్ ఏంటి? అంటే మా మధ్య ఎలాంటి గొడవ ల్లేవ్ అనేదేనట. కానీ క్లోజ్ సోర్స్ చెబుతున్న దానిని బట్టి సన్నివేశం మాత్రం వేరొకలా ఉంది మరి.