Begin typing your search above and press return to search.
స్టార్స్ సినిమాలపై బంద్ ఎఫెక్ట్..!
By: Tupaki Desk | 27 July 2022 8:11 AM GMTటాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ కానున్నాయంటూ గత కొన్ని రోజులుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వరుస లీకులు వదిలిన విషయం తెలిసిందే. అయితే గిల్డ్ ఆగస్టు 1 నుంచి ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలం ఓ కొలిక్కి వచ్చే వరకు షూటింగ్ లు బంద్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే నిర్మాతల మండలి మాత్రం అది తమ ఉద్దేశ్యం కాదని, షూటింగ్ ల బంద్ కు తాము వ్యతిరేకమని వాదిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో మొత్తానికి మంగళవారం యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాత్రం తాము షూటింగ్ లు బంగ్ చేయడానికే నిర్ణయించుకున్నామని ప్రకటించి షాకిచ్చింది. ఖర్చులకు, కాబడికి పొంతన కుదరడం లేదని, రాబడి కంటే ఖర్చులే ఈ మధ్య కాలంలో అధికమయ్యాయని, కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయని ఆ కారణంగానే తాము ఆగస్టు 1 నుంచి నిరవధికంగా షూటింగ్ లని నిలిపి వేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటించింది.
ఇక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాత్రం సినిమాల ఓటీటీ రిలీజ్ లపై కఠిన నిర్ణయాలని ప్రకటించింది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఓటీటీలో 10 వారాల తరువాతే స్ట్రీమింగ్ చేసుకోవాలని తేల్చేసింది. మినిమమ్ బడ్జెట్ సినిమాలు నాలుగు వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలా వుంటే తాజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆగస్టు 1 నుంచి సినిమాలు షూటింగ్ లని నిలిపి వేస్తున్నామంటూ ప్రకటించడం ఇప్పడు పెద్ద చిత్రాలకు ఇబ్బంది కరంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ప్రతీ స్టార్ హీరో మూవీ తాజా గిల్డ్ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోబోతోంది. ఇప్పటికే సెట్స్ పై వున్న మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు తాజా బంద్ కారణంగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొఓబోతున్నాయి. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు`, శంకర్ - రామ్ చరణ్ ల RC15, వంశీ పైడిపల్లి - విజయ్ ల వారసుడు, అఖిల్ ఏజెంట్, బాలకృష్ణ 107 ప్రాజెక్ట్, త్వరలో సెట్స్ పైకి రానున్న త్రివిక్రమ్ - మహేష్ బాబు మూవీ, కొరటాల శివ - ఎన్టీఆర్ ల ప్రాజెక్ట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ ల `పుష్ప 2`, నేచురల్ స్టార్ నాని `దసరా`.. నాగచైతన్య - వెంకట్ ప్రభు బైలింగ్వల్ మూవీ ఎఫెక్ట్ కానున్నాయి.
మరీ ముఖ్యంగా మెగాస్టార్ `గాడ్ ఫాదర్`కు తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. కారణం ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా నయనతార కూడా ఇందులో నటిస్తోంది. ఈ ఇద్దరిలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన కీలక ఘట్టాలు చిత్రీకరించాల్సి వుందట. వీటిని ముంబైలో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. మన సినిమాల షూటింగ్ లు అవుట్ డోర్ లోనూ చేయకూడదని గిల్డ్ అడ్డు చెబితే మాత్రం `గాడ్ ఫాదర్` కు భారీ షాక్ తగిలే అవకాశం వుందని తెలుస్తోంది.
కారణం సల్మాన్ ఖాన్ ఇచ్చి డేట్స్ పూర్తయితే మళ్లీ డేట్స్ ఇవ్వడం, కుదరడం కష్టం. ఇదే ఈ మూవీకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం వుందని చెబుతున్నారు. ఇదిలా వుంటే సల్మాన్ ఖాన్ నటిస్తున్న `కభీ ఈద్ కభీ దివాళీ` షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఎఫెక్ట్ కానుందని తెలుస్తోంది. ఇది బాలీవుడ్ మూవీ, నిర్మాత బాలీవుడ్ వ్యక్తి అయినా వర్క్ చేసే వర్కర్స్ ఇక్కడి వారు కావడంతో అది సినిమా షూటింగ్ పై ప్రభావం చూపించే అవకాశం వుందని అంటున్నారు. మరి దీన్ని సల్మాన్ టీమ్ ఎలా అధిగమిస్తుందో చూడాలి. `ఆచార్య` సెట్ లో దీనిక సంబంధించిన కీలక సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట.