Begin typing your search above and press return to search.
పాపం వారు అక్కడా ఫెయిలై..ఇక్కడా ఫెయిల్ అవ్వడం నిజంగా బ్యాడ్ లాక్..!
By: Tupaki Desk | 29 April 2020 11:30 PM GMTటాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గిపోయిన హీరో హీరోయిన్లకు వెబ్ సిరీసులు వరంగా మారుతున్నాయని చెప్పవచ్చు. కానీ వారికి అక్కడ కూడా క్రేజ్ రాకపోతే ఏమి చేయగలం చెప్పండి. ప్రస్తుతం తెలుగులోనూ వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ బాగా పెరుగుతోంది. ప్రేక్షకులు సినిమాల కంటే వెబ్ సిరీస్ లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం అవుతోంది. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ హవా నడవబోతున్నదని భావిస్తున్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు. స్టార్ నటీనటులు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే సమంత - ప్రియమణి - కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి తదితర హీరోలు హిందీ లో నేషనల్ వైడ్ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.
అయితే రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే హవా అని భావించి వాటిలో నటిస్తున్న వారు కొందరైతే.. ఇక్కడ క్రేజ్ కోల్పోయి సినిమాల్లో అవకాశాలు దొరక్క డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తున్నవారు మరికొందరు. మన టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ స్టేజికి వచ్చిన హీరో హీరోయిన్లు సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. సినిమాల్లో నిరూపించుకోలేకపోయినా కనీసం వెబ్ సిరీసులో క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే లక్ష్మి మంచు, సందీప్ కిషన్, ఆది పినిశెట్టి, ఆది సాయి కుమార్, నందు తదితర నటీనటులు ఆ వైపుగా అడుగులు వేశారు. ఒకప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఇలాంటి నటీనటులు.. ఇక సినిమాలతో లాభం లేదనుకొని ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అయితే ఇవి వీరికి ఏమాత్రం క్రేజ్ తీసుకురావడం లేదు అన్నది వాస్తవం. వారు నటిస్తున్న వెబ్ సెరీస్ లు ప్రేక్షకుల ఆదరణ పొందడం లేదట. వీరి పెర్ఫార్మన్స్ ఆల్రెడీ సినిమాల్లో చూసి ఉండటం వల్ల వెబ్ సిరీసుల్లో చూడలేకపోతున్నారో.. మరేదైనా కారణం వల్లనో తెలియదు కానీ.. మన వాళ్ళు నటిస్తున్న వెబ్ సిరీస్ లు పెద్దగా పట్టించుకోవడం లేదట. పాపం అక్కడ సినిమాల్లో ఫెయిల్ అవ్వడం.. ఇక్కడ వెబ్ సిరీస్ లలో ఫెయిల్ అవ్వడం నిజంగా వారి బ్యాడ్ లాక్ అని చెప్పవచ్చు.