Begin typing your search above and press return to search.
సినిమాలు లేక ఈ వారం కూడా ఆ సినిమానే దిక్కయింది
By: Tupaki Desk | 19 Sep 2022 8:43 AM GMTబాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమా వసూళ్లు రెండవ వారం కూడా నిలకడగా ఉన్నాయి. హిందీలో మరియు సౌత్ ఇండియాలో భారీ సినిమాలు ఏమీ కూడా విడుదల కాకపోవడంతో అంతంత మాత్రమే ఉన్నా కూడా జనాలు బ్రహ్మాస్త్ర థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా బ్రహ్మాస్త్ర సినిమా ఒక మోస్తరు వసూళ్లను రాబడుతూ ఉంది.
ఉత్తరాదిన ఈ సినిమా కనీసం వంద కోట్ల వసూళ్లు అయినా నమోదు చేస్తుందా అనే అనుమానాలు మొన్నటి వరకు ఉన్నాయి. ముఖ్యంగా విడుదల అయిన సమయంలో ఈ సినిమాకు వచ్చిన టాక్ తో నాలుగు వందల కోట్లు.. అయిదు వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు.
కంగనా రనౌత్ వంటి స్టార్స్ కూడా దర్శకుడు అయాన్ ముఖర్జీ ని కోట్లాది డబ్బు పోసి చెత్త సినిమా చేసినందుకు గాను కేసు నమోదు చేయాలి అంటూ విమర్శలు చేసింది. అలాంటి సినిమా ఇప్పుడు రెండో వారంలో కూడా మంచి వసూళ్లను రాబట్టుకోవడం అందరిని ఆశ్చర్యం కు గురి చేస్తోంది.
సోషల్ మీడియాలో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ఒక బ్యాచ్ రెండు మూడు నెలల నుండే ప్రచారం చేసింది. అయినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. మరో సినిమా లేక పోవడంతో బ్రహ్మాస్త్ర సినిమాని చూడ్డానికి వచ్చామంటూ చాలా మంది ప్రేక్షకులు మీడియాతో అంటున్నారట. ఏదో ఒక విధంగా సినిమాకు వసూళ్లు అయితే నమోదు అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.