Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ కి సిద్ధమైన సినిమాలు ఇవే!

By:  Tupaki Desk   |   20 Jan 2023 2:30 AM GMT
రీ రిలీజ్ కి సిద్ధమైన సినిమాలు ఇవే!
X
ఈ మధ్యకాలంలో సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. ఏదో ఒక సందర్భాన్ని వాడుకుంటూ ఒకప్పుడు హీరోల కెరీర్ లో సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలన్నింటినీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ముందుగా మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా, ఇటీవల ఖుషి తర్వాత మళ్లీ మహేష్ బాబు ఒక్కడు అంటూ ఇలా కొనసాగుతూనే ఉంది. అయితే రాబోతున్న అప్ కమింగ్ రీ రిలీజ్ సినిమాలు ఏమేమి ఉన్నాయి అనే దానిమీద ఒక లుక్కేసే ప్రయత్నం చేద్దాం.

ముందుగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కి, గత ఏడాది విడుదలై బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా జనవరి 19వ తేదీన విడుదలవుతోంది. ఇక తర్వాత రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మిరపకాయ సినిమా జనవరి 26వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతుంది.

ఒకప్పుడు కుర్రకారు అందరిని విపరీతంగా అలరించిన టైటానిక్ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల అవుతుంటే వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా రిలీజ్ అవుతోంది.

ఇక ఇవి రిలీజ్ డేట్లు ప్రకటించిన సినిమాలు కాగా ఇంకా ప్రకటించని సినిమాలను కూడా కొన్నింటిని అనౌన్స్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ -త్రిష జంటగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో పాటు అప్పట్లో ప్రేమికులందరినీ విపరీతంగా ఆకట్టుకున్న సెవెన్ బై జి బృందావన్ కాలనీ సినిమాలను కూడా రిలీజ్ చేయబోతున్నారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సింహాసనం సినిమా 8 కేలో, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా దేశముదురు సినిమా 4 కే, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి 4 కే సినిమాలను కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటనలు వచ్చాయి.

అయితే ప్రస్తుతానికి ఉన్న లిస్టు ఇదే అయినా సరే ఈ మధ్యలో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనవరి 20వ తేదీ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాని దేవీ సెవెంటీ ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుక్ మై షో టికెట్ బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.