Begin typing your search above and press return to search.

ఈవారం థియేటర్‌, ఓటీటీ సినిమాలు ఇవే

By:  Tupaki Desk   |   21 Dec 2022 4:22 AM GMT
ఈవారం థియేటర్‌, ఓటీటీ సినిమాలు ఇవే
X
ప్రతి వారం థియేటర్లలో మరియు ఓటీటీ ద్వారా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఈ వారం క్రిస్మస్ వీక్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ సినిమాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

ఈ వారం థియేటర్ల ద్వారా రాబోతున్న సినిమాల విషయానికి వస్తే... తమిళం మరియు తెలుగు లో లాఠీ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనెక్ట్‌ సినిమాను కూడా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రవితేజ ధమాకా సినిమా కూడా ఈ వారంలోనే విడుదల కాబోతుంది. డిసెంబర్ 23వ తారీకు ధమాకా విడుదల కానుంది.

ధమాకా విడుదల అవుతున్న రోజే నిఖిల్‌ హీరోగా నటించిన 18 పేజెస్ సినిమా విడుదల అవ్వబోతుంది. నిఖిల్‌ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ధమాకా మరియు 18 పేజెస్ సినిమాలు రెండు కూడా కచ్చితంగా మంచి విజయాలను సొంతం చేసుకుంటాయని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.

మలయాళం మూవీ 'కాప' డిసెంబర్‌ 22వ తారీకున థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక హిందీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రణ్వీర్ సింగ్ యొక్క సర్కస్ సినిమా కూడా ఈ వారంలో డిసెంబర్ 23వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవే కాకుండా ఓటీటీ లో ఇంకా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా హిట్ మూవీ మసూదా ను ఆహా వారు డిసెంబర్ 21న స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. జీ 5 లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ను డిసెంబర్‌ 23న స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

ఈ తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన పలు సినిమాలు నెట్‌ ఫ్లిక్స్.. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఇంకా ప్రైమ్‌ వీడియో లో స్ట్రిమింగ్‌ అవ్వబోతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్ల ద్వారా మరియు ఓటీటీ ద్వారా పెద్ద ఎత్తున ఎంటర్‌టైన్‌మెంట్‌ ను సినిమాలు అందించబోతున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.