Begin typing your search above and press return to search.

'లైగ‌ర్‌'తో పోటీకి సై అంటున్నాయి!

By:  Tupaki Desk   |   22 Aug 2022 11:30 AM GMT
లైగ‌ర్‌తో పోటీకి సై అంటున్నాయి!
X
నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఓ పెద్ద సినిమా వ‌స్తోందంటే మ‌గ‌తా వాటిని ప‌క్క‌కు త‌ప్పించ‌డం.. రిలీజ్ వాయిదా వేయించ‌డం వంటివి జ‌రిగాయి. కానీ ఇప్ప‌డు మాత్రం పాన్ ఇండియా మూవీ వ‌స్తోంద‌న్నా చిన్న సినిమాలు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఒక వేల పాన్ ఇండియా మూవీ టాక్ అటు ఇటుగా వుంటే మాకు క‌లిసి వ‌స్తుంది క‌దా అనే ధైర్యంతో పాన్ ఇండియా మూవీతో చిన్న సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో పాన్ ఇండియా మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అని తేలితే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ల్లంతు కావ‌డం గ్యారెంటీ.

ఈ విష‌యం తెలిసి కూడా చిన్న సినిమాలు పోటీకి దిగ‌డం నిజంగా సాహ‌స‌మే. ఆగ‌స్టు 25న రౌడీ స్టార్ విజ‌య్ దేవర‌కొండ - పూరి జ‌గ‌న్నాథ్ ల క‌ల‌యిక‌లో రూపొందిన 'లైగ‌ర్‌' వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ నెట్టింట బాయ్ కాట్ హాష్ ట్యాగ్ తో నెట్టింట వైర‌ల్ అవుతూ భారీ బ‌జ్ ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ మూవీతో చిన్న సినిమాలు పోటీకి దిగుతుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 26న 'ప‌లాస‌', శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న క‌రుణ్ కుమార్ పూర్తి ఎంట‌ర్ టైన్ మెంట్ వేలో తెర‌కెక్కించిన 'క‌ళాపురం'థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.

ఇదే రోజు సునీల్, హెబ్బా ప‌టేల్ న‌టించిన 'గీత‌' విడుద‌ల‌వుతోంది. దీనికి పెద్ద‌గా బ‌జ్ లేదు. ఇక సునీల్‌, ధ‌న్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'బుజ్జీ ఇలా రా' సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ అవుతోంది. వీటి మ‌ధ్య‌లో విక్ర‌మ్ 'కోబ్రా', ఆండ్రియా 'పిశాచి -2' ఆగ‌స్టు 31న థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. విక్ర‌మ్ 'కోబ్రా'పై అంచ‌నాలున్నాయి. 20 గెట‌ప్ ల‌లో విక్ర‌మ్ న‌టించిన సినిమా ఇది. ఇప్ప‌టికే రెండు సార్లు రిలీజ్ వాయిదా ప‌డిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఆగ‌స్టు 31న రాబోతోంది.

ఇదే సినిమాతో ఆండ్రియా 'పిశాచి -2' వ‌చ్చేస్తోంది. గ‌తంలో వ‌చ్చిన 'పిశాచి' మూవీకి సీక్వెల్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తించింది. మిస్కిన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీకి థియేట‌ర్లు భారీగానే కేటాయించే అవ‌కాశం వుంది.

వున్న‌ట్టుండీ ఇన్ని సినిమాలు పాన్ ఇండియా మూవీతో ఢీ అంటే ఢీ అంటూ పోటీకి దిగ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చిన్న సినిమాల‌కు థియేట‌ర్ల‌లో రిలీజ్ త‌రువాత ఓటీటీల్లో మంచి రేటు ప‌లుకుతోందట‌. ఆ కార‌ణం వ‌ల్లే ఏదైతే అదైంది అని చాలా వ‌ర‌కు చిన్న సినిమాల‌ని భారీ పోటీ వున్నా.. థియేట‌ర్ల స‌మ‌స్య వున్నా స‌రే థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన 'బింబిసార‌, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించిన నేప‌థ్యంలో చిన్న చిత్రాల మేక‌ర్స్ ఈ సినిమాలిచ్చిన ధైర్యంతో థియేట‌ర్లలోకి వ‌దులుతున్నార‌ట‌. 'లైగ‌ర్‌' బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటే వీటి ప‌రిస్థితి ఏంట‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.