Begin typing your search above and press return to search.
డిసెంబర్ చివర వరకూ సెట్స్ పైనే సంక్రాంతి సినిమాలు..!
By: Tupaki Desk | 17 Nov 2022 3:33 AM GMTమెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. "వాల్తేరు వీరయ్య" & "వీరసింహా రెడ్డి" సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో ఒకటీ లేదా రెండు రోజుల గ్యాప్ తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలానే రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకి పోటీగా తమిళ హీరోలు విజయ్ - అజిత్ కుమార్ నటించిన రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికైతే 2023 పొంగల్ రేసులో ఈ నాలుగు చిత్రాలు నిలిచే అవకాశం ఉంది. అయితే పండక్కి రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ఈ సినిమాల వర్క్ ఇంకా పెండింగ్ లో వుంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వీర సింహా రెడ్డి" మూవీ అనంతపురం షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఇంకా ఒక ఫైట్ సీక్వెన్స్ మరియు ఒక సాంగ్ పెండింగ్ ఉన్నాయి.
బాలయ్య మరియు హీరోయిన్ శృతి హాసన్ లపై లాస్ట్ సాంగ్ ని చిత్రీకరించాల్సి వుంది. దీని కోసం శృతి డిసెంబర్ 18 నుంచి డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉంటాయి.
కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వాల్తేరు వీరయ్య" మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి తన డబ్బింగ్ వర్క్ ని స్టార్ట్ చేసేసినట్టుగా టాక్. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న "వారసుడు" సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. కొంత ప్యాచ్ వర్క్ ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరపడానికి టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తోన్న "తునివు" సినిమాలో ఇంకా రెండు పాటలు మరియు ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
ఇలా సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన సినిమాలన్నీ శరవేగంగా పనులు జరుపుతున్నారు కానీ.. డిసెంబరు చివరి వారం వరకూ సెట్స్ మీదనే ఉంటాయనిపిస్తోంది. విడుదలకు నెల రోజుల టైమ్ కూడా లేదు కాబట్టి.. మరోవైపు దూకుడుగా ప్రమోషన్స్ చేయాల్సి వుంది.
ఇప్పుడు పండగ రిలీజ్ ని టార్గెట్ పెట్టుకొని ఉరుకులు పరుగులు తీయడం కంటే.. ముందు నుంచే అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మంచి అవుట్ పుట్ రావడానికి అవకాశం వుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరిచేసుకోడానికి సమయం దొరుకుతుందని అంటున్నారు.
అదే విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పుడు ఇలా హడావిడిగా చివరి నిమిషం వరకూ పని పెట్టుకోవడం వల్ల.. అన్నీ అనుకున్నట్లు జరగకపోవచ్చని పేర్కొంటున్నారు. "పుష్ప: ది రైజ్" సినిమా విషయంలో జరిగినట్లుగానే ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తడానికి ఆస్కారం వుంటుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.