Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: యూత్ ని టార్గెట్ చేసిన 'మిస్టర్ అండ్ మిస్'

By:  Tupaki Desk   |   1 April 2020 8:10 AM GMT
ట్రైలర్ టాక్: యూత్ ని టార్గెట్ చేసిన మిస్టర్ అండ్ మిస్
X
బుల్లితెర వ్యాఖ్యాత శైలేశ్ సన్నీ, ‘పెళ్లిచూపులు’ షో ఫేం జ్ఞానేశ్వరి కంద్రేగుల హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న సినిమా 'మిస్టర్ అండ్ మిస్'. ఈ సినిమాకు 'ఓ స్త్రీ రేపు రా' చిత్ర దర్శకుడు అశోక్ రెడ్డి కథను అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు. యువతీ, యువకులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చెప్పే విధంగా కథ అల్లుకున్నారు దర్శకుడు. 'మిస్టర్ అండ్ మిస్' సినిమా ట్రెయిలర్ రీసెంట్ గా విడుదలైంది.


ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్‌లో ఉంటారు. ఈ జంటలో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..అనే అంశాలతో తీసిన చిత్రంగా ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అంతే కాకుండా ఈ ట్రైలర్ లో ఉన్న సన్నివేశాలు, 'లైఫ్ లో ఏమి చేసినా ఎన్నిసార్లు చేసినా మొదటిది మాత్రం స్పెషలే కదా,, 'రోజులో అర గంట నీ బెడ్ మీద హ్యాపీగా ఉన్నానని మిగతా 23 గంటలు నిన్ను భరించలేను' వంటి డైలాగులు బట్టి చూస్తే ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేసే చిత్రంలా అనిపిస్తున్నది. యూట్యూబ్ లో రిలీజైన ఈ సినిమా ట్రెయిలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.