Begin typing your search above and press return to search.
ప్రీబిజినెస్: మజ్ను బెట్టింగ్ ఎంత?
By: Tupaki Desk | 23 Jan 2019 10:51 AM GMTఅక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన మూడవ సినిమా `మిస్టర్ మజ్ను` ఈనెల 25న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. ఈసారి అఖిల్ కాన్ఫిడెంట్ గా సోలోగా వస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ ఆకట్టుకుంది. రిలీజ్ ముంగిట అక్కినేని కాంపౌండ్ సహా అక్కినేని అభిమానులు - ట్రేడ్ లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. అఖిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలాంటి ఫలితం అందుకోబోతోంది? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే అఖిల్ విజేత అవ్వాలంటే ఎంత వసూలు చేయాలి? అంటే దానికి సమాధానమిదే...
మజ్ను బెట్టింగ్ ఎంత? అంటే.. `మిస్టర్ మజ్ను` ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించిందని తెలుస్తోంది. అఖిల్ నటించిన తొలి సినిమా `అఖిల్`కి హైప్ క్రియేట్ చేసి సుమారు 40 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేశారు. ఆ సినిమా పరాజయంతో ఆ తర్వాత `హలో` చిత్రానికి అంత బిజినెస్ సాగలేదు. మూడవ సినిమాకి మరికాస్త తగ్గినా .. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి ఇది బెస్ట్ బిజినెస్ అని చెబుతున్నారు.
ఏపీ - నైజాం కలుపుకుని 17.35 కోట్ల మేర మజ్ను థియేట్రికల్ బిజినెస్ సాగింది. నైజాం-6కోట్లు (అడ్వాన్స్) - సీడెడ్ -2.70కోట్లు (ఎన్ ఆర్ ఏ) - తూ.గో. జిల్లా- 1.50 కోట్లు (ఎన్ ఆర్ ఏ) - గుంటూరు- 1.50 కోట్లు (అడ్వాన్స్) - కృష్ణ- 1.35కోట్లు (ఎన్ ఆర్ ఏ) - ప.గో.జిల్లా- 1.25కోట్లు (ఎన్ ఆర్ ఏ) - నెల్లూరు -65 లక్షలు (ఎన్ ఆర్ ఏ) మేర బిజినెస్ సాగింది. ఇతర భారతదేశంలో 1.50 కోట్లకు బిజినెస్ చేశారు. అమెరికా కలుపుకుని ఓవర్సీస్ లో 3.70 కోట్ల మేర బిజినెస్ పూర్తయింది. అంటే దాదాపు 23 కోట్ల మేర షేర్ వరల్డ్ వైడ్ వసూలైతే అఖిల్ విజయం అందుకున్నట్టేనని ట్రేడ్ విశ్లేషిస్తోంది.