Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'మిస్టర్ మజ్ను'
By: Tupaki Desk | 25 Jan 2019 11:00 AM GMTచిత్రం : 'మిస్టర్ మజ్ను'
నటీనటులు: అక్కినేని అఖిల్ - నిధి అగర్వాల్ - రావు రమేష్ - నాగబాబు - ప్రియదర్శి - పవిత్ర లోకేష్ - సితార - హైపర్ ఆది - సుబ్బరాజు - సత్యకృష్ణ - విద్యు - రాజా తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జార్జ్.సి.విలియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి
తొలి సినిమా ‘అఖిల్’.. మలి సినిమా ‘హలో’ తీవ్ర నిరాశకు గురి చేయడంతో మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు అక్కినేని అఖిల్. దర్శకుడిగా తన తొలి సినిమా ‘తొలి ప్రేమ’తో సత్తా చాటిన వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మిస్టర్ మజ్ను’ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
విక్కీ (అక్కినేని అఖిల్) ఒక ప్లేబాయ్. ఏ అమ్మాయిని చూసినా నిమిషాల్లో పడేస్తాడు. కొన్ని రోజులు ఆ అమ్మాయితో రొమాన్స్ చేసి విడిపోతాడు. ఇలా పదుల సంఖ్యలో అమ్మాయిలతో ప్రేమాయాణం నడిపిన అతడికి.. తనకు కాబోయే వాడు రాముడై ఉండాలని ఆశించే నిక్కీ (నిధి అగర్వాల్) పరిచయం అవుతుంది. ముందు విక్కీని అసహ్యించుకున్న నిక్కీ.. తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి ప్రేమిస్తుంది. విక్కీ కూడా నిక్కీని ప్రేమించడానికి అంగీకరిస్తాడు కానీ.. తర్వాత ఆమె తీరు అతడికి నచ్చదు. అది అర్థం చేసుకుని విక్కీకి దూరం అవుతుంది నిక్కీ. ఐతే ఆమె దూరమయ్యాకే విక్కీకి ప్రేమ విలువేంటో తెలుస్తుంది. ఈ స్థితిలో అతను మళ్లీ నిక్కీకి దగ్గర కావడానికి ఏం చేశాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘అఖిల్’ సినిమాలో తనకు సరిపోని విన్యాసాలేవేవో చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు అక్కినేని అఖిల్. ఆ తర్వాత కొంచెం జాగ్రత్త పడి.. విక్రమ్ కుమార్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో ‘హలో’ లాంటి వైవిధ్యమైన చిత్రం చేశాడు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా నిలబడలేదంటే.. అక్కినేని కుర్రాడికి ‘అఖిల్’ చేసిన డ్యామేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అఖిల్ చుట్టూ ఒక రకమైన నెగెటివిటీ ముసురుకున్న నేపథ్యంలో అతడి కెరీర్ ను పైకి లేవడానికి ఒక మిరాకిల్ లాంటి సినిమా అవసరం. ‘మిస్టర్ మజ్ను’ సినిమా ఒక దశ వరకు సాగే తీరు చూస్తే మిరాకిల్స్ జరగకపోయినా.. అఖిల్ కు ఇదొక డీసెంట్ మూవీ అవుతుందనే అనిపిస్తుంది. తొలి రెండు సినిమాల్లో మాదిరి నేలవిడిచి సాము చేయకుండా.. అందరికీ తెలిసిన ఒక సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఒదిగిపోవడానికి అఖిల్ సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నట్లే కనిపిస్తుంది. ‘తొలి ప్రేమ’ స్థాయిలో కాకపోయినా వెంకీ అట్లూరి కూడా ఓ మోస్తరుగానే ఎంగేజ్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఐతే ప్రథమార్ధంలో ‘ఓకే’ అనిపించే ‘మిస్టర్ మజ్ను’ ద్వితీయార్ధంలో ‘వావ్’ అనిపిస్తోందేమో అని ఆశిస్తే.. కనీసం తొలి సగంలో మాదిరి ‘ఓకే’ ఫీలింగ్ కూడా తీసుకురాదు. పదుల సినిమాల్లో చూసినట్లే ఒక ఫార్ములా ప్రకారం నడిపించేసి మమ అనిపించేయడంతో ‘మిస్టర్ మజ్ను’ ఒక సాధారణ సినిమాలా మిగిలిపోయింది.
వెంకీ అట్లూరి తొలి సినిమా ‘తొలి ప్రేమ’లో ఒక మంచి ప్రేమకథకు అవసరమైన అన్ని లక్షణాలూ కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రేమకథకు అతి ముఖ్యమైన ‘ఫీల్’ తీసుకురావడంలో అది విజయవంతమైంది. దీనికి తోడు కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా బలంగా ఉండటంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యారు. అందులోనూ ద్వితీయార్ధం కొంచెం సాధారణంగా సాగిపోయినప్పటికీ.. ఎమోషన్లకు ఢోకా లేకపోవడంతో చల్తా అనిపించేసింది. కానీ ‘మిస్టర్ మజ్ను’ ప్రథమార్ధం వరకు ఏదో అలా ఎంగేజ్ చేయనైతే చేస్తుంది కానీ.. ఇక్కడ ప్రేమకథలో ఫీల్ మిస్సయింది. హీరోను ఇక్కడ స్త్రీలోలుడిగా చూపించారు. హీరోయిన్ అతడిని చూసి అసహ్యించుకుంటుంది. కానీ చిన్న కారణాలతో తన అభిప్రాయాలు మార్చుకుని అతడితో గాఢమైన ప్రేమలో పడిపోతుంది. హీరో కూడా ఈజీగా హీరోయిన్ తో ప్రేమలో దిగిపోతాడు. ఇద్దరూ కలవడానికీ పెద్ద కారణాలు కనిపించవు. అలాగే విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు కూడా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఓవైపు ప్రేమకథలో పెద్దగా ఫీల్ కొరవడి.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా బలంగా లేకపోవడంతో తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకుల్ని అంతగా కదిలించవు. ఇద్దరూ విడిపోతుంటే పెద్దగా బాధ కలగనపుడు.. వాళ్లు మళ్లీ కలిస్తే బాగుండన్న భావన ఎలా వస్తుంది? ఆ భావన రానపుడు హీరో హీరోయిన్ల రీ యూనియన్ మీదే నడిచే ద్వితీయార్ధంతో ఎలా కనెక్టవుతారు?
ప్లే బాయ్ లాగా ఉండే కుర్రాడు సీరియస్ ప్రేమికుడిగా మారిపోయి పరిణామం చెందే కథలతో దశాబ్దాలుగా చాలా సినిమాలు వచ్చాయి తెలుగులో. వీటిలో చాలా వరకు విజయవంతం అయినవే. ఏఎన్నార్.. నాగార్జున సైతం ఇలాంటి ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. బహుశా అఖిల్ కూడా అదే ధీమాతో ఈ కథను ఒప్పుకున్నట్లున్నాడు. కథ పాతదైనా ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథను నడపిస్తే విజయవంతం కావచ్చు. ‘తొలి ప్రేమ’తో యూత్ టేస్టేంటో బాగా తెలిసిన వాడిలా కనిపించాడు వెంకీ. ప్రేమకథలో ఫీల్ సంగతి వదిలేస్తే.. ప్రథమార్ధంలో వెంకీ నరేషన్ ప్రేక్షకుల్ని బాగానే ఎంగేజ్ చేస్తుంది. అఖిల్ ను ప్లేబాయ్ గా చూపించడంలో కొంచెం అతి చేసినప్పటికీ.. దానికి పూర్తి భిన్నంగా కుటుంబంలో బాధ్యతాయుతంగా ఉండే కుర్రాడిగా అఖిల్ పాత్రను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కుటుంబంలో సమస్య తలెత్తినపుడు దాన్ని హీరో పరిష్కరించే విధానం ఆకట్టుకుంటుంది. ఇటు సెంటిమెంటుతో పాటు యాక్షన్ పార్ట్ కూడా బాగానే డీల్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సరదాగానే సాగిపోవడంతో సమయం వేగంగానే సాగిపోతుంది. కాకపోతే హీరో హీరోయిన్ల లవ్-బ్రేకప్ విషయంలోనే కొంచెం హడావుడి అయిపోయింది. అయినప్పటికీ ప్రథమార్ధం వరకు ‘మిస్టర్ మజ్ను’ ఎక్కడా పెద్దగా బోర్ అనిపించదు.
ద్వితీయార్ధంలో మాత్రం గ్రాఫ్ పడుతూ వెళ్తుందే తప్ప ఎక్కడా లేవదు. హీరోను అసహ్యించుకుని వెళ్లిపోయిన హీరోయిన్ దగ్గరికే హీరో వెళ్లడం.. ఆమె చుట్టూ ఉన్న వాళ్లు ఇంప్రెస్ చేయడం.. హీరోయిన్లోనూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నించడం.. చివరగా హీరోయిన్ సీరియస్ గా మరోసారి అసహ్యించుకుంటే త్యాగం చేసి వెళ్లిపోవడం.. పతాక సన్నివేశంలో కథానాయిక రియలైజ్ అయి హీరోను చేరుకోవడం.. ఈ ఫార్ములా ఎన్ని సినిమాల్లో చూడలేదు? హైపర్ ఆదిని పెట్టుకుని కామెడీ కోసం ట్రై చేశారు కానీ.. అదేమీ ఫలితాన్నివ్వలేదు. అవసరం లేని ఫైట్లు.. పాటలు ఏదో ఫిల్లింగ్ లాగా అనిపిస్తాయి తప్ప ఎంగేజ్ చేయవు. ఆల్బంలో బెస్ట్ సాంగ్ అయిన ‘కోపంగా...’ కూడా సరైన ప్లేస్మెంట్ కుదరక అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మొత్తంగా చూస్తే.. ఓకే అనిపించే ప్రథమార్ధం.. యువతను మెప్పించే అఖిల్ పెర్ఫామెన్స్.. సాంకేతిక ఆకర్షణలు ‘మిస్టర్ మజ్ను’ను కొంతవరకు నిలబెట్టేవే కానీ.. కొత్తదనం.. బలం లేని కథ.. నీరసం తెప్పేంచే ద్వితీయార్ధం నిరాశకు గురి చేస్తాయి.
నటీనటులు:
ప్లేబాయ్ టర్న్ డ్ సీరియస్ లవర్ పాత్రకు అఖిల్ న్యాయం చేయడానికి బాగానే కష్టపడ్డాడు. లుక్స్.. స్టైలింగ్.. బాడీ లాంగ్వేజ్ లాంటి విషయాల్లో శ్రద్ధ పెట్టి ప్లేబాయ్ గా పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. ఐతే ఎమోషనల్ సీన్లలో సీరియస్ గా నటించాల్సి వచ్చినపుడు తడబడ్డాడు. నటనలో ఇంకా కొంచెం సహజత్వం రావాల్సి ఉంది. డిక్షన్ కూడా మెరుగుపడాలి. ట్రెండీగా లుక్.. ఔట్ ఫిట్ తో ఈ తరం యువతకు నచ్చేలా కనిపించాడు అఖిల్. డ్యాన్సులు.. ఫైట్లలో ఎప్పట్లానే ప్రతిభ చూపించాడు. నిధి అగర్వాల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాత్రకు సెట్టయింది కానీ.. ఆమె ప్రత్యేకత అంటూ ఏమీ కనిపించదు. రావు రమేష్ ఉన్నంతసేపూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ ఒక దశ దాటాక ఆయన పాత్రను పూర్తిగా పక్కన పెట్టేశారు ఎందుకో మరి. ప్రథమార్ధంలో ఆ పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యానికి తగ్గట్లు రెండో అర్థంలో కొంచెం అవకాశమిచ్చి ఉంటే సినిమాకు బలమయ్యేవాడు. జయప్రకాష్.. నాగబాబు.. సితార.. పవిత్ర లోకేష్.. రాజా.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లుగా కనిపించారు. ప్రథమార్ధంలో ప్రియదర్శి అక్కడక్కడా నవ్వించాడు. హైపర్ ఆది ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయలేదు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
తమన్ తన సంగీతంతో ‘మిస్టర్ మజ్ను’కు బలంగా నిలిచాడు. ‘కోపంగా..’తో పాటు ఇంకో రెండు మూడు పాటలు బాగున్నాయి. ఐతే టైటిల్ సాంగ్ మినహా పాటలు సినిమాలో ఆశించినంత ప్రభావవంతంగా లేవు. తమన్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. జార్జ్ విలియమ్స్ విజువల్స్ సినిమాకు మరో ఆకర్షణ. ప్రతి సన్నివేశం కంటికింపుగా కనిపించేలా కెమెరా పనితనం చూపించాడతను. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఏమీ రాజీ పడలేదు. సినిమా అంతా రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తన తొలి సినిమా ‘తొలి ప్రేమ’ ఫార్ములానే ఇక్కడా ఫాలో అయ్యాడు. ప్రథమార్ధంలో లవ్-బ్రేకప్.. ద్వితీయార్ధంలో రీయూనియన్.. ఇలా కథను నడిపించాడు. కానీ ఈసారి అతను పకడ్బందీ కథనాన్ని అల్లుకోలేదు. పాత్రల చిత్రణ.. స్క్రీన్ ప్లే విషయంలో పైపైన నడిపించాడు. బిగి కొరవడింది. యూత్.. ఫ్యామిలీస్ మెచ్చేలా కొన్ని సన్నివేశాలు తీర్చిదిద్దాడు కానీ.. ఓవరాల్ ఔట్ పుట్ విషయంలో నిరాశ పరిచాడు. ప్రథమార్ధంలో అక్కడక్కడా మినహాయిస్తే.. ద్వితీయార్ధంలో ఎక్కడా దర్శకుడి ముద్ర కనిపించలేదు.
చివరగా: మిస్టర్ మజ్ను.. డోస్ సరిపోలేదు!
రేటింగ్-2.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre