Begin typing your search above and press return to search.
చైతూ గురించి `నాగ్-అమల` నంబర్లు తీసుకున్నానన్న అమీర్
By: Tupaki Desk | 20 Sep 2021 3:30 PM GMTచైతూ `లవ్ స్టోరి` ప్రచార వేదికపై మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ .. ఉద్వేగభరిత ప్రసంగం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సహా చైతన్య అభిమానుల్లో ఇదే ఇప్పుడు చర్చనీయాంశం.
ఇంతకీ ఈ వేదికపై అమీర్ ఖాన్ ఏమని ప్రసంగించారు? అంటే..
``నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడకు వచ్చాను. మేం కలిసి సినిమా కోసం పని చేస్తున్నాం. నేను నాగ చైతన్యతో కొన్ని అనుభవాలను కలిగి ఉన్నాను. అతని తల్లిదండ్రులతో పంచుకోవాలనుకున్నాను. నేను తన తండ్రి గారి ఫోన్ నంబర్ అతని తల్లి నంబర్ కూడా తీసుకున్నాను. కానీ నేను అతని అభిమానులందరికీ కూడా ఏదో చెప్పాలనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నటుడిగా క్రియేటర్ గా మాత్రమే కాకుండా తన స్వభావంతో ఎవరికైనా హృదయాన్ని తాకేలా ఉండే ఈ వ్యక్తితో పనిచేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను అతని తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నది ఏదీ అంటే... అతనికి ఇచ్చినది చాలా బాగుంది. అతను మనందరి ముందు ఇలా ఉన్నాడు. తను నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు అని అనిపించింది. నేను నా బృందం అతన్ని ప్రతిరోజూ మిస్ అవుతున్నాం`` అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. చైతన్య లాంటి మంచి మనసున్న వ్యక్తిని రోజూ మిస్ అవుతున్నానని అమీర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించడంపై అభిమానులు ప్రత్యేంగా గుర్తు చేసుకుంటున్నారు.
``నేను ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చా అని నాగ చైతన్యను అడిగాను. అందుకే నిర్వాహకులు నన్ను బలవంతంగా ఆహ్వానించాల్సి వచ్చింది`` అని అమీర్ ఖాన్ అన్నారు. అంటే.. ఈ వేడుకకు అప్రయత్నంగానే అమీర్ ఖాన్ తనకు తానుగానే కోరి వచ్చారని చైతూ గురించి ఏదైనా చెప్పాలని భావించారని అర్థం చేసుకోవచ్చు.
నాగచైతన్య- సమంత విడిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో అమీర్ ఖాన్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నాగ చైతన్య స్వభావంపై అమీర్ వివరణ చర్చకు వచ్చింది. అమీర్ ఖాన్ తన హృదయం నుండి మాట్లాడినా.. ఇప్పుడు దీనిని అభిమానులు చర్చిస్తున్నారు. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `లవ్ స్టోరి` సెప్టెంబర్ 24న రిలీజవుతోంది. ప్రచార వేదికపై సడెన్ గా అమీర్ ఖాన్ ప్రత్యక్షమవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమీర్ ఖాన్ తో కలిసి నాగచైతన్య ప్రస్తుతం `లాల్ సింగ్ చద్దా` అనే చిత్రంలో నటిస్తున్నారు.
హిందీ డెబ్యూ.. చై ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు నాగచైతన్య. మజిలీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాక అతడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్ స్టోరి`ని రిలీజ్ కి తెస్తున్నారు. తదుపరి `లాల్ సింగ్ చద్దా` సినిమాతో చైతన్య అక్కినేని హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కథానాయకుడు. చైతూ- అమీర్ లపై చెప్పుకోదగ్గ సీన్స్ ఇందులో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం నాగచైతన్య తన భాగాన్ని పూర్తి చేశాడు. ఆసక్తికరంగా చైతన్య పాత్ర ఇందులో ఎంతో ఎమోషనల్ గా సాగుతుందని అతడి పాత్ర చనిపోతుందని తెలిసింది. వారియర్ గా మరణించే సన్నివేశాన్ని భావోద్వేగం రేకెత్తించేలా ఆవిష్కరిస్తున్నారని తెలిసింది. ఇందులో చైతన్య అమీర్ తో పాటు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అయితే యుద్ధంలో చనిపోయిన యువ సైనికుడి (చైతన్య) గా చై కనిపిస్తారు. అతడి తల్లిదండ్రులను ఓదార్చేందుకు కాకినాడకు చేరుకుంటారు అమీర్ ఖాన్. అందుకు సంబంధించిన సన్నివేశాలను ఇంతకుముందు తెరకెక్కించారు.