Begin typing your search above and press return to search.

'మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌'.. హె చెలి.. వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   4 Feb 2022 7:24 AM GMT
మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌.. హె చెలి.. వ‌చ్చేసింది
X
బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఫేమ్ స‌య్య‌ద్‌సోహైల్ రియాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌`. మైక్ మూవీస్ బ్యాన‌ర్ పై అన్న‌ప‌రెడ్డి అప్పిరెడ్డి, ర‌విరెడ్డి స‌జ్జ‌ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ తోనే అటెన్ష‌న్ క్రియేట్ చేసిన ఈ మూవీతో శ్రీనివాస్ వింజ‌నంపాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న‌రు. రూపా కొడ‌వాయూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఓ వెరైటీ క‌థ‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా హే చెలీ.. అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని శుక్ర‌వారం హీరో విశ్వ‌క్ సేన్ విడుద‌ల చేశారు.

ఇటీవ‌ల విడుద‌లైన `క‌థ వేరుంట‌ది.. పాట‌కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. తాజాగా .. హే చెలి.. అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. హీరో సోహైల్‌, హీరోయిన్ రూపా కొడ‌వాయూర్ మ‌ధ్య సాగే రొమాంటిక్ సాంగ్ గా ఈ పాట‌ని చిత్రీక‌రించారు.ఈ పాట‌లో హీరోహీరోయిన్ ల మ‌ధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. శ్రావ‌ణ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించారు. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించారు.

సోహైల్ కు హీరోగా ఇది తొలి చిత్రం. తొలి సినిమాకే ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ని ఎంచుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఇందులో సోహైల్ ప్రెగ్నెంట్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఓ హీరో ప్రెగ్నెంట్ కావ‌డం ఏంటీ అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశం నేప‌థ్యంలో ఓ సామాజిక అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ద‌ర్శ‌కుడు ప్ర‌యోగాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తుది ద‌శ‌కు చేరుకున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా చిత్ర బృందం ఈ చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియోల‌ని వ‌న్ బై వ‌న్ రిలీజ్ చేస్తోంది. విబిన్న‌మైన క‌థ‌తో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందుతున్న ఈ మూవీపై సోహైల్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. అత‌ని అంచ‌నాల‌ని ఈ మూవీ ఎంత వ‌ర‌కు నిజం చేసి హీరోగా అత‌ని కెరీర్ కు బాట‌లు వేస్తుందో చూడాలి.