Begin typing your search above and press return to search.

సింగిల్ గానే మృణాల్..మింగిల్ అయ్యేది ఇంకెప్పుడో?

By:  Tupaki Desk   |   15 Feb 2022 4:30 PM GMT
సింగిల్ గానే మృణాల్..మింగిల్ అయ్యేది ఇంకెప్పుడో?
X
Tబాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టెంప్టింగ్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం ఇన్ స్టాని హాట్ ఫోటోల‌తో హీటెక్కించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. తాజాగా మృణాల్ మ‌రోసారి చెల‌రేగింది. పింక్ క‌ల‌ర్ బికినీలో కెమెరాకి ఫోజులిచ్చిన ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. అందాల ఆర‌బోసి వైర‌ల్ అవ్వ‌డం అమ్మ‌డికి కొత్తేం కాదు.

ఇక్క‌డే ఓ కామెంట్ పెట్టి స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో వాలంటైన్స్ డే సంద‌ర్భంగా `స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు` తెలిపింది. ఆగ‌స్టు 15న చెప్పాల్సిన శుభాకాంక్ష‌లు ముందుగానే చెప్పేసింది? ఏంట‌ని కొంద‌రికి సందేహం రావొచ్చు.

కానీ అమ్మ‌డి దృష్టిలో స్వాతంత్ర్య అంటే ఆ అర్ధం కాదు. వ్య‌క్తిగ‌తంగా సింగిల్ గా ఉండ‌టమే సంతోషంగా ఉంద‌నే విష‌యాన్ని సూచిస్తుంది. కానీ బ్యూటీ త‌రుచూ చేసే స్పైసీ ఎలివేష‌న్ చూస్తే మృణాల్ సింగిల్ అని ఎవ‌రైనా అనుకుంటారా? ఇంకా మింగిల్ కాకుండా ఉంటుందా? అని సందేహ‌ప‌డొచ్చు. కానీ ప్ర‌స్తుతాని సింగిల్ గానే క‌నిపిస్తుంది కాబ‌ట్టి అలాగే భావించాలి.

ఇక మృణాల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే `బాహుబ‌లి`ఐ దిఫోర్ ది బిగినింగ్` సిరీస్ లో న‌టించింది. `బాహుబ‌లి` లో శివ‌గామి పోషించిన పాత్ర‌ని సిరీస్ లో పోషించింది. కానీ మొద‌టి కాపీ త‌ర్వాత ఆ సిరీస్ ని నిలిపివేసారు. ప్ర‌స్తుతం తెలుగులో `లెప్ట్ నెంట్ క‌ల్న‌ల్ రామ్` చిత్రంలో నటిస్తోంది.

బాలీవుడ్ లో `జెర్సీ` రీమేక్ లో షాహిద్ క‌పూర్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. అలాగే చేతిలో మ‌రో రెండు క‌మిట్ మెంట్లు ఉన్నాయి. `ల‌వ్ సోనియా` చిత్రంతో మృణాల్ బాలీవుడ్ ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత `సూప‌ర్ 30`..`బ‌ట్లాహౌస్`..`ఘోస్ట్ స్టోరీస్`..`తూఫాన్`..`ధ‌మాకా` స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించింది. కానీ అవేవి పెద్గగా స‌క్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ లో ఇంకా అంత క్రేజీ భాగా వెలిగిపోలేదు. ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. అవ‌కాశాలు వ‌స్తున్నా..స‌క్సెస్ లు రావ‌డం లేదు. ఆ ర‌కంగా మృణాల్ కెరీర్ ప‌రంగా వెనుక‌బ‌డింది. `జెర్సీ` పై చాలా ఆశ‌లు పెట్టుకుంది.

ఇందులో హీరో షాహిద్ క‌పూర్ తో రొమాంటిక్ స‌న్నివేశాల్లో హ‌ద్దు మీరే న‌టించిన‌ద‌ని టాక్ వినిప‌స్తోంది. ఇంటిమేట్ స‌న్నివేశాల్లో ఓ రేంజ్ లో చెల‌రేగింద‌ని స‌మాచారం. అలాగే తెలుగులో హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి క‌మిట్ అయింద‌ని స‌మాచారం. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. ఇందులో మృణాల్ కి జోడీగా దుల్కార్ స‌ల్మాన్ న‌టించ‌నున్నాడుట‌. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా అధికారిక స‌మాచారం లేదు.