Begin typing your search above and press return to search.
ఇన్ స్టా లో సీతకి లాభం 1 మిలియన్!
By: Tupaki Desk | 29 Aug 2022 5:25 AM GMTహీరో లేదా హీరోయిన్ నటించిన సినిమా హిట్ అయితే వారి యొక్క పారితోషికం భారీగా పెరగడం కామన్ విషయం. కెరీర్ ఆరంభంలో పాతిక లక్షలు.. ముప్పై లక్షల పారితోషికాలు తీసుకుంటూ సినిమాలు చేసే హీరోయిన్స్ ఒక్క సూపర్ హిట్ అయితే దాదాపుగా కోటి పారితోషికం తీసుకునే రేంజ్ కి వెళ్తారు. ఇప్పుడు మృనాల్ ఠాకూర్ అదే పరిస్థితిలో ఉంది.
మొన్నటి వరకు బుల్లితెరపై సందడి చేసి.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ మెల్ల మెల్లగా కెరీర్ లో నిలదొక్కుకుంటున్న ముద్దుగుమ్మ మృనాల్ తాజాగా సీతారామం సినిమా తో ఒక్క సారిగా ఇక్కడ అక్కడ స్టార్ హీరోయిన్ గా మారి పోయింది. మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగు లో ముందు ముందు బిజీ అవ్వబోతుంది.
సీతారామం సినిమా కేవలం మృనాల్ యొక్క పారితోషికం భారీగా పెంచడంతో పాటు వరుసగా ఆఫర్లు తెచ్చి పెట్టడం మాత్రమే కాకుండా ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో భారీ ఎత్తున ఫాలోవర్స్ పెరిగేలా చేసింది. సీతారామం సినిమాకు ముందు వరకు మృనాల్ యొక్క ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 4.5 మిలియన్ ల మంది. ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య 5.5 మిలియన్ల మంది.
ఈ మూడు వారాల్లోనే ఏకంగా మిలియన్ మంది ఆమెను కొత్తగా ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఆ మిలియన్ మందిలో మెజార్టీ శాతం మంది తెలుగు వారు అయ్యి ఉంటారు. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు మృనాల్ ఠాకూర్ ను సీతగా తెగ అభిమానిస్తున్నారు.
ఆమె ఫోటో షూట్స్ ను మరియు ఆమె వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉన్నారు. అందుకే మంచి ఫాలోవర్స్ సంఖ్య ను మృనాల్ దక్కించుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. Abuse వద్దు.