Begin typing your search above and press return to search.

సమంత ప్లేస్ లో 'సీతారామం' సీత...!

By:  Tupaki Desk   |   26 Aug 2022 5:35 AM GMT
సమంత ప్లేస్ లో సీతారామం సీత...!
X
కొన్నాళ్ల క్రితం నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమా రూపొందబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కారణం ఏంటో కానీ ఆ సినిమా ప్రచారం అయితే జరిగింది కానీ పట్టాలెక్కలేదు. అసలు ఆ సినిమా గురించి చర్చలు జరిగాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ గురించి మళ్లీ చర్చ మొదలు అయ్యింది.

నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ కు చెందిన స్వప్న సినిమాస్ వారు ఆ సినిమా ను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారట. అయితే సమంత ప్లేస్ లో తమ గత చిత్రం సీతారామం హీరోయిన్ మృనాల్‌ ఠాకూర్ ను కన్ఫర్మ్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఒక మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్ మూవీగా నందిని రెడ్డి ఆ సినిమాను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సమంత బిజీగా ఉన్న కారణంగా ప్రస్తుతానికి నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా ను చేయడం సాధ్యం కాదని.. అందుకే ఆ స్థానంలో మృనాల్ ఠాకూర్ ను తీసుకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఒక వేళ మృనాల్‌ ఠాకూర్ ఈ లేడీ ఓరియంటెడ్‌ సినిమా తో మరో విజయాన్ని టాలీవుడ్ లో తన ఖాతాలో వేసుకుంటే ఆమె స్థాయి స్టార్‌ హీరోయిన్ ల స్థాయికి పెరగడం ఖాయం.

సీతారామం సినిమా కోసం చాలా తక్కువ పారితోషికం తీసుకున్న మృనాల్‌ ఇప్పుడు నందిని రెడ్డి సినిమా కోసం ఏకంగా కోటి రూపాయల వరకు పారితోషికం అందుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సీతారామం సినిమా తో ఒక్కసారి గా టాలీవుడ్‌ సెన్షేషన్ అంటూ పేరు దక్కించుకుని వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న మృనాల్‌ వెంటనే లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేయడం కరెక్టా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

నటిగా మంచి గుర్తింపు దక్కించుకుని ఇప్పుడు కమర్షియల్‌ హీరోయిన్‌ గా టాలీవుడ్‌ లో జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్న మృనాల్‌ ఠాకూర్ కి నందిని రెడ్డి లేడీ ఓరియంటెడ్‌ సినిమా ఎంత వరకు ఉపయోగదాయకం అవుతుంది అనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.