Begin typing your search above and press return to search.

నేలపైనే పడుకున్న ధోని, ఆయన భార్య

By:  Tupaki Desk   |   10 April 2019 8:38 AM GMT
నేలపైనే పడుకున్న ధోని, ఆయన భార్య
X
ధోనిని అందరూ ఎందుకు అంతగా ఇష్టపడుతారు.? ఎందుకు నడిపించే నాయకుడు అని అంటారు.. టీమిండియా కెప్టెన్ కోహ్లీతో సహా ఎందుకు అందరూ క్రికెటర్లు తమకు ధోనినే స్ఫూర్తి అని చెబుతారు... జట్టు గెలిచినా.. ఓడినా.. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా చెక్కుచెదరని సంకల్పం ధోనికి ఎలా వచ్చింది. అంత కూల్ గా, సింపుల్ గా ధోని ఎందుకు ఉంటాడు.. అంటే ఆయన పెరిగిన సాదాసీదా జీవితమే పాఠాలు నేర్పింది.

ధోని పేదరికం, మధ్యతరగతి జీవితాల్లోంచే పైకి ఎదిగాడు. అందుకే అత్యున్నత శిఖరాలకు ఎదిగినా తన మూలాలు మాత్రం మరిచిపోడు. ధోని లాంటి స్టార్ క్రికెటర్.. అంత డబ్బు ఉండి కూడా సాధారణ వ్యక్తిలో నేలపైనే పడుకున్నాడు.. అతడి భార్య సాక్షి కూడా అలానే నేలపైనే పడుకోవడం విశేషం. సింప్లిసిటీకి నిలవెత్తు నిదర్శనమైన ధోని మరోసారి తన సాధారణ మనస్తత్వాన్ని చాటుకున్నాడు.

నిన్న రాత్రి కోల్ కతా తో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో అలసిసొలసిన ధోని తగినంత విశ్రాంతి లేకపోవడంతో కోల్ కతా విమానాశ్రయంలో విమానం కోసం వేచి చూసే సమయంలో నేలపైనే తన లగేజ్ పై తల వాల్చి కాసేపు కునుకు తీశాడు. మరోవైపు ధోని భార్య సాక్షి కూడా భర్త అడుగుజాడల్లో అదే బ్యాగ్ పై ఇంకో వైపు కునుకుతీసింది.

చైన్నై జట్టు సభ్యులు ఎదురుగా కూర్చొని ఈ భార్య భర్తల సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. చెన్నై జట్టు కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ధోని సింప్లిసిటీపై పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. అభిమానులు ధోని గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.