Begin typing your search above and press return to search.
ధోనీకి ఒకటి ఫస్ట్, ఇంకొకటి సెకండ్ ప్లేస్!
By: Tupaki Desk | 3 Oct 2016 9:23 AM GMTటీమిండియా లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీ బాక‍్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు, రెండోరోజు కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. వీకెండ్ లో ధోనీ వసూలు చేసిన రికార్డ్ వసూళ్లపై ఇప్పటికే ఫిల్మ్ మేకర్స్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సినిమాకు తొలిరోజు 21.30 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వసూలు చేసింది. ఇదే క్రమంలో ఆదివారం కూడా భారీ కలెక్షన్స్ సాధించిందట ధోనీ మూవీ.
మొదటి రెండు రోజుల్లోనూ రూ. 41.9 కోట్ల రూపాయలను వసూల్ చేసిన ధోనీ సినిమా, ఆదివారం రూ. 24.10 కోట్లతో భారీ కలెక్షన్లు సాధించింది. దీంతో మొత్తంగా రూ.66 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ అన్ టోల్డ్ స్టోరీ! ఈ కలెక్షన్లతో 2016లో చిత్ర ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచినట్లు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'సుల్తాన్' అంతకుముందు అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు వసూలు చేసినట్లు ఆయన ప్రస్తావించారు.
ఇదే సమయంలో ఇప్పటివరకూ వచ్చిన బయోపిక్ జోనర్ సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా. గతంలో వచ్చిన బయోపిక్ సినిమాలు రూ.10 - 15 కోట్లలోపే తొలి రోజు వసూళ్లు రాబట్టగలిగాయి. ఆ రికార్డును కూడా తొలిరోజు రూ.21.30 కోట్లతో ధోనీ సినిమా తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, సుషాంత్ సింగ్ రాజ్ పుట్ ధోని పాత్రను పోషించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/