Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: తెలుగు ఎమ్‌.ఎస్‌. ధోనీ

By:  Tupaki Desk   |   18 Aug 2016 4:10 AM GMT
ట్రైలర్ టాక్: తెలుగు ఎమ్‌.ఎస్‌. ధోనీ
X
"అసలు నేను ఏమి చేస్తున్నానో అని ఆలోచిస్తున్నాను - నేనొక క్రికెటర్ ని కానీ గరక్ పూర్ రైల్వే స్టేషన్ లో టీసీ గా పనిచేస్తున్నాను. అంతేకాదు మూడో గేట్ లో నుంచిని ఫైన్ లు కట్టించుకుంటూన్నాను. నా ఆట ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు సార్, మరో అవకాశం దొరికేటట్టుకూడా లేదు.. నేను ఎన్నిరోజులు ఇంకా ఇలా గడపాలి సర్.. అంటూ మొదలైంది "ఎమ్‌.ఎస్‌. ధోనీ - ది అన్‌ టోల్డ్‌ స్టోరీ" తెలుగు ట్రైలర్. టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ ఎమ్‌.ఎస్‌.ధోనీ జీవితంపై వస్తున్న ఈ సినిమా సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్రైలర్ హిందీలో ఉండటంతో దాన్ని చూసిన తెలుగు ప్రేక్షకుల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమయంలో సినిమా తెలుగులో కూడా విడుదల చేయాలని భావించడంతో.. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ధోనీ జీవితంలో ప్రపంచానికి తెలియని విషయాలు.. ధోనీ స్కూల్లో చదువుతున్నప్పటినుండి భారతదేశానికి ప్రపంచ కప్ అందించేనాటివరకూ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఒక రైల్వే టీసీ.. టీం ఇండియా కెప్టెన్ ఎలా అయ్యాడు అనే అంశం ప్రధాన కథగా ఉంది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కొడుకు ఉద్యోగం గురించి తల్లితండ్రులు ఎలా ఆలోచిస్తారు, ఆ స్థాయి వ్యక్తి - జీవితంలో ఒక ఉన్నతస్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలి.. ఎన్ని రాజకీయాలను ఎదుర్కోవాలి.. ఎన్ని ఆటంకాలను అధిగమించాలి అనే విషయాలు ధోనీ జీవిత కథద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రైలర్ చివర్లో... "ధోనీ ఫినిసెష్ ఆఫ్ ఇన్ హిస్ స్టైల్.. మెగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ది క్లవ్డ్.. ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్.. అండ్ ఇట్ ఈస్ ఎన్ ఇండియన్ కేప్టెన్ హూస్ బీన్ ఎబ్సల్యూట్లీ మెగ్నిఫిసెంట్ ఇన్ ది నైట్ ఆఫ్ ద ఫైనల్" అంటూ రవిశాస్త్రి సూపర్ మాస్ వాయిస్ కామెంట్రీతో వస్తున్న మాటలు శరీరంపై రోమాలు లేచినిలబడిన సంఘటనలు గుర్తుచేయకమానవు.

సుషాంత్‌ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నీరజ్‌ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ సినిమా చరిత్రలో ఇంత వరకూ ఏ సినిమా ట్రైలర్‌ కు రానన్ని లైక్ లు.. వ్యూస్ "ఎమ్‌.ఎస్‌. ధోనీ - ది అన్‌ టోల్డ్‌ స్టోరీ" ట్రైలర్‌ కు వచ్చింది. ఆరురోజుల్లోనే ఈ ట్రైలర్ ను 14 మిలియన్లకు మంది వీక్షించారు. ఇక ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదల కానుంది. ధోనీ తొలినాళ్లలోని లుక్ ని తలపించేలా సుశాంత్ సింగ్ లాంగ్ హెయిర్ తో ఉంటూ.. హెలికాప్టర్ షాట్లు కొడుతూ సినిమాలో కనిపించబోతున్నాడు.