Begin typing your search above and press return to search.
ధోని ట్రైలర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయ్
By: Tupaki Desk | 8 Sep 2016 7:30 PM GMTఫాలోయింగ్ విషయంలో సినిమా తారలు ధోని ముందు దిగదుడుపే అనడానికి అతడి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ విషయంలో జనాల్లో ఉన్న ఆసక్తే రుజువు. ధోని కథలో కొత్తేముంటుంది.. అతడి స్టోరీతో సినిమా అంటే జనాలు ఏమంత ఆసక్తి చూపిస్తార్లే అని తేలిగ్గా తీసిపడేసిన వాళ్లకు దీని ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్సే సమాధానంగా నిలిచింది. టీజర్.. ట్రైలర్ రికార్డులంటే అందరికీ సల్మాన్ ఖానో.. అమీర్ ఖానో.. షారుఖ్ ఖానో గుర్తుకొస్తాడు. ఐతే వాళ్ల సినిమాల ట్రైలర్ల రికార్డుల్ని అలవోకగా దాటేసింది ‘ధోని’ ట్రైలర్. సుల్తాన్ ట్రైలర్ ఒక్క రోజులో అత్యధికంగా 33 లక్షల వ్యూస్ తెచ్చుకుంటే ‘ధోని’ ట్రైలర్ కు ఏకంగా 52 లక్షల హిట్స్ పడ్డాయి. ఇండియాలో అత్యంత వేగంగా కోటి మార్కును అందుకున్న ట్రైలర్ గానూ ఇది రికార్డు సృష్టించింది.
తాజాగా ఇండియాలో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ గానూ ‘ధోని’ రికార్డు సాధించింది. ఈ ట్రైలర్ కు 3.5 లక్షల లైక్స్ వచ్చాయి. ‘కబాలి’కి ఇంతకంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి కానీ.. అది టీజర్ రికార్డు. ట్రైలర్ వరకు ‘ధోని’దే రికార్డన్నమాట. ‘ధోని’ హిందీ ట్రైలర్ కు మాత్రమే 1.93 కోట్ల హిట్స్ వచ్చాయి. తెలుగు.. తమిళం ట్రైలర్లు కూడా కలుపుకుంటే లెక్క 2.18 కోట్ల దాకా ఉంది. ఇండియాలో ఈ మార్కును అందుకున్న ట్రైలర్లు చాలా తక్కువ. ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజిలో జరుగుతోంది. ఆల్రెడీ శాటిలైట్ రైట్స్ ద్వారానే రూ.60 కోట్లు వచ్చి పడ్డాయి. బిజినెస్ మొత్తంగా రూ.300 కోట్లకు చేరుకున్నట్లు చెబుతున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదలవుతుంది.