Begin typing your search above and press return to search.
తండ్రి అవుతోన్న ధోని
By: Tupaki Desk | 1 Sep 2019 5:44 AM GMTభారత క్రికెట్ జట్టు జర్నీలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఎప్పుడూ గోల్డెన్ పేజీలు లిఖించబడి ఉంటాయి. ఎంతో మంది మహామహులైన క్రికెటర్లకు సాధ్యం కాని రికార్డులు ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే సాధ్యమయ్యాయి. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టోర్నమెంటులన్ని ధోనీ సారధ్యంలోనే భారత్ ఖాతాలో పడ్డాయి. ఇదిలా ఉంటే కోట్లాది మంది ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్. ధోనీ త్వరలోనే తండ్రి కానున్నాడు.
ధోనీ 2010లో తన చిన్నాటి స్నేహితురాలు అయిన సాక్షిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాక్షి ప్రెగ్నెంట్ అని... ఆమె త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సమాచారం. జార్ఖండ్ డైనమైట్ గా ఇండియన్ క్రికెట్ అభిమానుల మదిలో నిలిచిన ధోనీకి సాక్షి చిన్ననాటి క్లాస్ మెట్. ఆమె హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు కంప్లీట్ చేసింది. ఆమె ప్రెగ్నెంట్ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆమె మీడియాకు కూడా దూరంగా ఉంటోంది.
ఇక సాక్షిని 2010లో పెళ్లి చేసుకున్నాక ధోనీ కెరీర్ స్కై రేంజ్ కు చేరుకుంది. ఆ మరుసటి యేడాదే ధోనీ సారథ్యంలోనే భారత్ ప్రపంచకప్ ను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ తర్వాత మళ్లీ 28 ఏళ్లకు భారత ప్రపంచకప్ కలలు ధోనీ సారథ్యంలోనే నెరవేరాయ్. అందుకే సాక్షి తన అదృష్ట చిహ్నమని ధోనీ చాలా సార్లు ఓపెన్ గానే చెప్పాడు.
ఇక ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో జరిగిన ధోనీ ప్రదర్శన ఆశించినంత లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం వెస్టిండిస్ టూర్ నుంచి విశ్రాంతి తీసుకుంటోన్న ధోనీ వచ్చే యేడాది జరిగే 20-20 ప్రపంచకప్ వరకు జట్టులో ఉండి తన సత్తా ఏంటో చాటాలని కసితో ఉన్నాడు.