Begin typing your search above and press return to search.
ఆకట్టుకోలేకపోయిన ఎమ్మెస్ జీవిత గాధ!!
By: Tupaki Desk | 21 April 2017 5:48 AM GMTఎమ్మెస్ నారాయణ జీవితం చరిత్ర పై పుస్తకం వస్తోందని తెలియగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 700 సినిమాల్లో నటించిన ఓ నటుడు.. తెలుగు లెక్చరర్ గా పని చేసిన వ్యక్తి.. సంస్కృతంలో పండితుడు అనిపించుకున్న ఎమ్మెస్ నారాయణ జీవితం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిన వారికి.. కూనపరాజు కుమార్ రాసిన ''ఎమ్మెస్ నారాయణ జీవిత గాథ'' ఇప్పుడు నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.
ఎమ్మెస్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నా.. వాటిని పుస్తకరూపంలో అందించడంలో రచయిత అంత ప్రావీణ్యత చూపలేకపోయాడు. ఎమ్మెస్ నారాయణ ప్రారంభ రోజులు.. ఎదగడానికి అనుభవించిన కష్టాలు.. ఆలోచనా విధానాలను వివరించలేకపోవడాన్ని ప్రధాన లోపంగా చెప్పచ్చు. బయోగ్రఫీలు రాయడంలో అనుభవలేమి స్పష్టంగా కనిపించిందని పాఠకులు అంటున్నారు. అనేక చోట్ల వాక్యీకరణ కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడం ఆశ్చర్యకమైన విషయమే. అలాగే ఎమ్మెస్ జీవితంలోని సంఘటనలను.. వరుస క్రమంలో అందించకుండా.. అటూ ఇటూ చేసేయడం కూడా చదివేవారిని గందరగోళానికి గురి చేసింది.
ఒక మంచి పుస్తకం అయేందుకు అన్ని అవకాశాలు ఉన్న ఎమ్మెస్ జీవితం.. సాధారణ బుక్ మాదిరిగా నిలిపోయిందనే చెబుతున్నారు. అయితే.. ఈ పుస్తకంలో బ్రహ్మానందం.. తనికెళ్ల భరణి.. పరుచూరి బ్రదర్స్ వంటి వారు.. ఎమ్మెస్ గురించి రాసిన వ్యాసాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/