Begin typing your search above and press return to search.
ఎమ్మెస్ చేతిలో డాలర్ పెట్టి..
By: Tupaki Desk | 4 Sep 2016 5:30 PM GMTఅక్కడెక్కడో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ మామూలు వ్యక్తిలా పంచె కట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఉంటే.. బిచ్చగాడు అనుకుని ఓ మహిళ డబ్బులు దానం చేసి వెళ్లిందట. దాదాపుగా తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని ఓ కాలమ్ లో రాసుకున్నారు దివంగత కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. ఆ సంగతులేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘‘యమహో యమ’ అనే సినిమా కోసం అమెరికాకు వెళ్లాం. లాస్ ఏంజిల్స్ లోని హాలీవుడ్ దగ్గర షూటింగ్ చేశాం. అది ఇంగ్లిష్ సినిమా పరిశ్రమకు కేంద్రం. శ్రీహరి గారు యమధర్మరాజుగా.. నేను చిత్రగుప్తుడిగా నటించాం ఆ సినిమాలో. కొడాక్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగేది అక్కడే. ఆ థియేటర్ బయట సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్ పాత్రల తరహాలో పెద్ద బొమ్మలుండేవి. వాటి దగ్గర టూరిస్టులు ఫోటోలు దిగేవారు.
కొందరు మనుషులు కూడా ఇలాంటి వేషాలే వేసుకునేవాళ్లు. వాళ్లతో ఫోటోలు తీసుకుని ఒక డాలరు ఇవ్వడం అక్కడ రివాజు. ఐతే షూటింగ్ విరామంలో మేం కూడా మా వేషాల్లో అక్కడ తిరుగుతుంటే.. ఓ అమెరికా మహిళ ‘ఫోటో ప్లీజ్’ అంది. నేను ఆమెతో కలిసి ఓ ఫోటో తీసుకున్నా. వెంటనే ఆమె నా చేతుల్లో ఓ డాలర్ పెట్టింది. నేను షాక్ తిన్నాను. తర్వాత ఆమెకు డాలర్ తిరిగిచ్చేస్తూ.. మేం ఇక్కడ సినిమా షూటింగులో పాల్గొంటున్నట్లు చెప్పాను. ఆమె సారీ అని చెప్పి వెళ్లిపోయింది’’ అని ఎమ్మెస్ గుర్తు చేసుకున్నారు.