Begin typing your search above and press return to search.
భూమికకి అంత కోపం వస్తుందనుకోలేదు!
By: Tupaki Desk | 8 Jun 2022 12:30 AM GMTఒకప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఎమ్మెస్ రాజు ఒకరు. ఆయన బ్యానర్లో చేయడానికి స్టార్ హీరోలు .. హీరోయిన్స్ ఉత్సాహాన్ని చూపించేవారు. ఇండస్ట్రీ హిట్స్ జాబితాలో ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. 'శత్రువు' .. 'దేవి' .. 'మనసంతా నువ్వే' .. 'ఒక్కడు' .. 'వర్షం' .. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాలను ప్రేక్షకులు మరిచిపోలేదు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెస్ రాజు, 'ఒక్కడు' సినిమాను గురించి ప్రస్తావించారు.
'ఒక్కడు' సినిమా కోసం హీరో .. హీరోయిన్లుగా మహేశ్ బాబుగారినీ .. భూమిక గారిని తీసుకున్నాం. ఈ సినిమా కోసం 'చార్మినార్' సెట్ వేయడం అవసరమని దర్శకుడు గుణశేఖర్ గారు అన్నారు.
'ఖర్చు ఎక్కువవుతుందేమో .. నిజంగానే చార్మినార్ దగ్గర చేసేద్దాం .. ఉదయాన్నే షూటింగు పెట్టుకుంటే పెద్ద జనం ఉండరు' అని మహేశ్ బాబు అన్నాడు. గుణశేఖర్ గారు అనుకున్న విధంగా చేయాలంటే సెట్ అవసరమవుతుందని భావించి అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఆ సినిమా మాసివ్ హిట్ అయింది. ఆ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు.
'మనసంతా నువ్వే' సినిమా బాగా ఆడటం వలన .. మంచి లాభాలు వచ్చాయి. ఆ సినిమాలో వచ్చిన డబ్బంతా నేను 'ఒక్కడు' సినిమాపై పెట్టాను. అందువల్లనే చార్మినార్ సెట్ వేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ సినిమా షూటింగులో ఒక సంఘటన జరిగింది. 'అరకు'లో ఛేజింగ్ తో కూడిన ఒక యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశాము. ఆ యాక్షన్ ఎపిసోడ్ లో భాగంగా మహేశ్ బాబు - భూమికను కొంతమంది రౌడీలు తరుముతూ ఉంటారు. ఆ సమయంలో వర్షం పడుతూ ఉంటుంది.
ఆ వర్షంలో వాళ్లు అలా పరిగెడుతూ ఉంటే ఒక మేకల మంద ఎదురుగా వస్తుంది. ఆ మేకల గుంపు పక్క నుంచి ఈ ఇద్దరూ పరిగెత్తాలి. చుట్టూ ఫెన్సింగ్ ఉన్న సర్కిల్లో ఆ మేకలను ఉంచాము. అందులో నుంచి ఒక మేకపిల్ల బయటికి దూకేసింది. ఫైట్ మాస్టర్ అసిస్టెంట్ ఆ మేకపిల్లను పట్టుకుని ఆ ఫెన్సింగ్ లోకి విసిరేశాడు.
అది చూసి భూమికకి కోపం వచ్చేసింది. అతణ్ణి పట్టుకుని ఇంగ్లిష్ లో చెడామడా తిట్టేసింది. అలాగే ఒక సీన్ తీయడానికి చెట్టు కొమ్మ అడ్డొస్తుందని కొట్టబోతే .. అలా చేయడానికి భూమిక ఒప్పుకోలేదు .. అంత మంచి మనసు ఆమెది" అని చెప్పుకొచ్చారు.