Begin typing your search above and press return to search.

దర్శకుల్నే నమ్మితే బెటర్‌ రాజు గారూ

By:  Tupaki Desk   |   8 April 2015 1:30 AM GMT
దర్శకుల్నే నమ్మితే బెటర్‌ రాజు గారూ
X
ఎవరైనా స్టార్‌ ప్రొడ్యూసర్‌.. దర్శకుడైతే తప్పేం లేదు. ఎందుకంటే స్వీయానుభవం బోలెడంత నేర్పిస్తుంది ఇక్కడ. దర్శకుడవ్వడానికి పదేళ్లు అసిస్టెంటుగా పనిచేయాలన్న రూలు కూడా లేదు. సరిగ్గా ఇదే పాయింటు ఎమ్మెస్‌ రాజు లాంటి స్టార్‌ ప్రొడ్యూసర్‌ని దర్శకుడిని చేసి ఉండొచ్చుగాక! కానీ అదే అతడికి పెద్ద మైనస్‌ కూడా అయ్యిందంటే అతిశయోక్తి కాదు.

తనయుడు సుమంత్‌ అశ్విన్‌ని 'తూనీగ తూనీగ' చిత్రంతో వెండితెరకి పరిచయం చేసిన రాజుగారు ఆ చిత్రానికి తనే స్వయంగా దర్శకత్వం వహించి పెద్ద తప్పు చేశారు. తొలి ప్రయత్నమే కొడుక్కి భారీ పరాజయాన్ని మిగిల్చారు. ఏదేమైనా జీవితంలో అదో పాఠం లాంటిది. అయితే తాను దర్శకుడిగా కొడుక్కి విజయాన్ని ఇవ్వాలి. తిట్టినవాళ్లే తనని పొగడాలి.. అని భావించి రాజుగారు మరోమారు అదే ఎటెంప్ట్‌ చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చల్లోకొచ్చింది. రాజుగారు మరోసారి కొడుకుని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈసారి ఏమవుతుందో? అన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈసారి కూడా మునుపటిలాగే సైలెంటుగా ఆయనే డైరెక్ట్‌ చేసేస్తుండడం గుసగుసల్లోకి వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్‌ పనులు నడుస్తున్నాయి. ఈ సినిమాకి వేరే ఎవరైనా దర్శకుడిని ఎంపిక చేసుకోవచ్చు కదా! ఓ వైపు నిర్మాతగా 24 శాఖల్ని సమన్వయం చేస్తూ, దర్శత్వం చేయడం కష్టం కాదా? తప్పులేవైనా జరిగితే మూల్యం భారీగానే ఉంటుంది కదా! రాజుగారూ వేరే దర్శకులకే ఛాన్సివ్వచ్చు కదా!