Begin typing your search above and press return to search.
రాజమండ్రి భార్యాభర్తల స్టోరీతో రాజుగారు!
By: Tupaki Desk | 24 Jun 2022 2:30 AM GMTనిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టి దర్శకుడిగా టర్న్ తీసుకుని బిజీ అవుతోన్న ఎమ్. ఎస్ రాజు సక్సెస్ ఫుల్ జర్నీ గురించి చ చెప్పాల్సిన పనిలేదు. 1990లో 'శత్రువు' సినిమాతో మొదలైన నిర్మాత ప్రయాణం 'మస్కా' వరకూ దిగ్విజయంగా సాగింది. నిర్మాతగా చేనేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రాలే చేసారు.
ప్రస్తుతం ఆయన దర్శకుడిగా రాణించడమైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'వాన'..'తూనీగ తూనీగ' చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. అటుపై 'డర్టీ హరి' లాంటి శృంగారభరిత చిత్రాలు చేయగలనని నిరూపించారు. ప్రేమ..శృంగారం ఎలాంటి కథనైనా తనదైన టేకింగ్ తో మెప్పించగలనని ప్రూవ్ చేసారు.
అయితే ఈ రెండు జానర్ల మధ్య వ్యత్యాసాన్ని తెలివిగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అసభ్యంగా సాగే చిత్రాలకి- రొమాంటిక్ చిత్రాలకి మధ్య ఓ చిన్న గీత గీసుకుని ముందుకు సాగుతున్నారు. రెండు జానర్లపై బ్యాలెన్సింగ్ ప్రయాణం చేస్తున్నారు. '7 డేస్ 6 నైట్స్' అంటూ రేపు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే తుదపరి చిత్రాల్ని రాజుగారు లైన్ లో పెడుతున్నారు. ఈసారి సంచలనాత్మక కథాంశాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజమండ్రి నేపథ్యంలో సాగే భార్యా భర్తల కథతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజుగారి మాటల్ని బట్టి ఓ యధార్ధ గాథ ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజమండ్రి లో జరిగిన భార్యభర్తల స్టోరీనే కథా వస్తువుగా..సినిమాటిక్ గా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ స్టోరీ ఏంటి? నటీనటులు కొత్త వారా? అనుభవం గలవారా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అలాగే గతంలో రాజుగారు నిర్మించిన ఓ సినిమాకి కొనసాగింపుగా ఓ చిత్రం చేస్తారుట.
ఆ సినిమాని ఏకంగా 14 భాషల్లో రూపొందించనున్నారుట. భారీ కాన్వాస్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సమయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటివకూ 14 భాషల్లో ఏ చిత్రాన్ని నిర్మించలేదు. ఆ రకంగా చూసుకుంటే రాజుగారు రికార్డు సృష్టించినట్లే. వివిధ భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలున్నారు.
దాదాపు అన్ని భాషల్లోనూ మూవీ మోఘల్ రామానాయుడు సినిమాలు నిర్మించారు. కానీ ఒకేసారి ఇన్ని భాషల్లో ఏ పరిశ్రమ నిర్మాత సినిమా నిర్మించలేదు. ఆ రకంగా చూసుకుంటే రాజుగారు ఇండస్ర్టీ రికార్డు తిరగరాసే చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అన్నది చూడాలి.