Begin typing your search above and press return to search.
వర్షం వెనుక పది మంది దర్శకులు
By: Tupaki Desk | 1 Nov 2015 1:30 PM GMTదాదాపు పుష్కరం కిందట టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన సినిమా. హీరో ప్రభాస్ ను స్టార్ ను చేసి.. తెలుగులో త్రిష కూడా పెద్ద హీరోయిన్ని చేసిన సినిమా ఇది. ‘బాబి’ లాంటి ఫ్లాప్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శోభన్ ను డైరెక్టర్ గా పెట్టి ఎమ్మెస్ రాజు చేసిన సాహసం ఈ సినిమా. ఆ సాహసానికి అద్భుతమైన ఫలితం వచ్చింది. టాలీవుడ్లో ‘వర్షం’ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విశేషాన్ని మీడియాతో పంచుకున్నాడు ఎమ్మెస్ రాజు. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణుల్లో పది మంది ఆ తర్వాత డైరెక్టర్లయ్యారు.
ఈ వరసలో ముందు ఎమ్మెస్ రాజు గురించే చెప్పాలి. ‘వర్షం’ సినిమాకు రాజు నిర్మాతే కాదు, స్క్రీన్ ప్లే రచయిత కూడా. ఆ తర్వాత ఆయన ‘వాన’ సినిమాతో దర్శకుడైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘వర్షం’కు కథ అందించిన వీరూ పోట్ల కూడా ‘బిందాస్’తో మెగా ఫోన్ పట్టాడు. ‘వర్షం’ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి కూడా ‘నా ఆటోగ్రాఫ్’తో దర్శకుడయ్యారు. అసోసియేట్ డైరెక్టర్లలో ఒకడైన వంశీ పైడిపల్లి ప్రభాస్ తోనే ‘మున్నా’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇంకో ఇద్దరు అసోసియేట్ డైరెక్టర్లు గౌతమ్ పట్నాయక్ (కెరటం), శ్రావణ్ (ప్రియుడు) డైరెక్టర్లుగా మారారు. కో డైరెక్టర్ రాంబాబు ‘బావ’ సినిమాతో దర్శకుడయ్యాడు. ఇక అన్నిటికంటే పెద్ద విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు ముగ్గురు డ్యాన్స్ మాస్టర్లు పని చేస్తే ఆ ముగ్గురూ కూడా దర్శకులయ్యారు. ఆ ముగ్గురూ.. లారెన్స్ - ప్రభుదేవా - సుచిత్రా చంద్రబోస్. మొత్తానికి ‘వర్షం’ సినిమా వెనుక పది మంది డైరెక్టర్లు ఉన్నారన్నమాట.