Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ముగ్ధమనోహరాన్ని చూశారా?

By:  Tupaki Desk   |   26 May 2015 7:30 AM GMT
ఫోటో స్టోరి: ముగ్ధమనోహరాన్ని చూశారా?
X
ముగ్ధా గాడ్సే.. 2008లో ఫ్యాషన్‌ సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఆ సినిమాలో ప్రియాంక చోప్రాతో పాటు సూపర్‌మోడల్‌ క్యారెక్టర్‌లో అల్లాడించింది. ప్రియాంక, కంగనల నటనతో పాటు ముగ్ధా నటనకు అంతే ప్రశంసలొచ్చాయి. ఆ తర్వాత డజను పైగానే సినిమాల్లో నటించింది ముగ్ధ. 2015లో ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తోంది. కాగజ్‌ కే ఫూల్స్‌, ఆఫ్రా టఫ్రీ, ఇష్క్‌ నే క్రేజీ కియా రే, తానీ ఒరువన్‌ (తమిళ్‌), బెజువాన్‌ ఇష్క్‌.. అనే చిత్రాల్లో కనిపించి కిక్కిస్తుందట.

ఇవన్నీ ఒకెత్తయితే లేటెస్టుగా అమ్మడు జీక్యూ మ్యాగజైన్‌కు చాలా కసిగా ఫోజులిచ్చింది. ఆ ఫ్యాషన్‌ స్టిల్స్‌ కొన్ని నెట్‌లోకి వచ్చాయి. వీటిలో ముగ్ధ స్టయిలిష్‌ లుక్‌ అదిరిపోయింది. సూపర్‌మోడల్‌కి పర్యాయపదంలా కనిపించింది. ముగ్ధ అన్న పేరుకు తగ్గట్టే ముగ్ధ మనోహరంగా కనువిందు చేసింది. జీన్స్‌ బ్యాక్‌ పాకెట్‌లోకి చేతులు పోనిచ్చి, ఓరచూపు రువ్వుతూ కవ్విస్తున్న ఈ రూపాన్ని మర్చిపోవడం అంత వీజీనా? ముఖ్యంగా అందాల ఒంపులన్నీ మన కళ్ళలో తిష్టేసుకుని కూర్చునేలా ఎక్కడకక్కడ బిగుతైన కట్టడాలతో కట్టిపాడేసిందంతే. ఇంతటి అందానికి బాలీవుడ్‌లో బ్రేకెప్పుడొచ్చేనే..!!