Begin typing your search above and press return to search.

ఆస్కార్‌ కి రెహమాన్‌ కి చాలా దూరం

By:  Tupaki Desk   |   30 Sep 2015 4:14 AM GMT
ఆస్కార్‌ కి రెహమాన్‌ కి చాలా దూరం
X
నిజానికి ఆస్కార్ నామినేషన్‌ కు.. ఆస్కార్‌ నామినేషన్‌ కోసం ఒక సినిమాను పంపడం అనే విషయానికీ చాలా దూరం ఉంది. మనోళ్లు ఈ విషయం తెలుసుకోకుండా ఏ.ఆర్‌.రెహమాన్‌ సినిమా ఆస్కార్‌ బరిలో ఉంది అంటూ తెగ ఊదరగొట్టేస్తున్నారు ఇప్పుడు. అక్కడ అంత సీన్ లేదు.

మ్యాటర్‌ ఏంటంటే.. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన ఇరానీ దర్శకుడు మాజిద్‌ మజిదీ సినిమా ''ముహమ్మద్‌''. ఈ సినిమాను ఆ దేశం వారు తమ అఫీషియల్‌ ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీగా ప్రకటించారు. ఇకపోతే ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఓ 90 దేశాలు తమ దేశం తరుపునుండి ఒక సినిమాను సెలక్టు చేస్తాయి. ఇండియా కూడా మరాఠి సినిమా ''కోర్టు''ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటి నుండి అకాడమీ అవార్డుల జ్యూరి ఓ అయిదు సినిమాలను ''బెస్ట్‌ ఫారిన్‌ ఫిలిం'' క్యాటగిరీలో నామినేట్‌ చేస్తుంది. వాటిలో ఒక చిత్రం గెలుస్తుంది. సో - వేరే దేశం వారి కోసం రెహమాన్‌ సంగీతం అందించిన సినిమాతో మన దేశం నుండి వచ్చిన కోర్టు సినిమా కూడా పోటీపడుతోంది. వీటిలో వేటికి నామినేషన్‌ దక్కుతుందో తెలియదు మరి. కాబట్టి అప్పుడే ఆస్కార్‌ రేసులో రెహమాన్‌ ఉండటమేంటి... ఆ అయిదు నామినేషన్లలో రెహమాన్‌ సినిమా ఉంటే అప్పుడు ఆ మాట అనాలేమో!!

ఇకపోతే.. బెస్ట్‌ ఫారిన్‌ ఫిలిం అనే అవార్డును దర్శకుడికి ఇస్తారు. అది యావత్ దేశానికి గుర్తింపు క్రింద పరిగణిస్తారు. అంతేకాని సంగీతం అందించినందుకు రెహమాన్‌ కు ప్రత్యేకంగా ప్రైజ్‌ ఏమీ ఇవ్వరులే. ఆ సినిమా రెహమాన్‌ ఖాతాలోకి వచ్చే ఛాన్సులేదు.. ఏదో ఆస్కార్‌ వచ్చిన సినిమాకు మనోడు పనిచేశాడని చెప్పటం తప్పించి...