Begin typing your search above and press return to search.

అంబానీ చిన్న కోడ‌లు ఈమేనా?

By:  Tupaki Desk   |   30 July 2018 11:32 AM GMT
అంబానీ చిన్న కోడ‌లు ఈమేనా?
X

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట్లో కొద్ది రోజులుగా పెళ్లి సంద‌డి ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ - శ్లోకా మెహ‌తాల ప్రీ-ఎంగేజ్ మెంట్ వేడుక కొద్ది రోజుల క్రితం జ‌రిగింది. ముకేశ్ పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ - రోజీ బ్లూ డైమండ్స్‌ అధినేత రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాల‌కు త్వ‌ర‌లో పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఆ తర్వాత, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ - పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్ ల పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఇక మిగిలింది, ముకేశ్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. అయితే, తాజాగా అనిల్ అంబానీ కూడా ప్రేమ‌లో ఉన్న‌ట్లు, త్వ‌ర‌లోనే అనిల్ పెళ్లిబాజా కూడా మోగ‌బోతోంద‌ని తెలుస్తోంది. త‌న స్నేహితురాలు - యాంకర్‌ హెల్త్‌ కేర్‌ సీఈవో - వైస్‌ చైర్మన్‌ విరైన్‌ మెర్చంట్‌ కూతురు రాధికా మెర్చంట్ తో అనిల్ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఈ వార్త వెలుగులోకి వ‌చ్చింది.

రాధికను అనంత్ గ‌ట్టిగా పట్టుకుని....ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ముసిముసి న‌వ్వులు నవ్వుతోన్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆకుపచ్చ రంగు డ్రెస్ లు వేసుకున్న ఈ ఇద్ద‌రు వెకేష‌న్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ ఫొటోలో క‌నిపిస్తోంది. దీంతో ఆ ఇద్ద‌రు రిలేష‌న్ లో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో నెటిజ‌న్లు క‌న్ ఫ‌ర్మ్ చేస్తున్నారు. ఆ ఇద్ద‌రికీ తమ బెస్ట్‌ విషెష్‌ అంటూ శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. అయితే, అనంత్ - రాధికాల ప్రేమ పుకార్ల‌ను అంబానీ ఫ్యామిలీ కొట్టిపారేసింది. అయితే, మ‌రోవైపు - ఆకాశ్‌ - శ్లోకా ఎంగేజ్‌ మెంట్‌ పార్టీలో అనంత్‌ను తన గర్ల్‌ ఫ్రెండ్‌ విషయంలో షారుఖ్‌ టీజ్‌ చేశారు. త్వరలోనే వీరి వివాహాన్ని కూడా అంబానీ ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే అనంత్ - రాధికాల రిలేష‌న్ పై అధికారికంగా అంబానీ ఫ్యామిలీ నుంచి క‌న్ ఫ‌ర్మేష‌న్ లేదు. మ‌రి, అంబానీ ఇంట మూడు జంట‌లు క‌లిసి ముచ్చ‌ట‌గా పెళ్లి పీట‌లెక్కుతాయేమో వేచి చూడాలి.