Begin typing your search above and press return to search.

మ‌హేష్ త‌న‌ను బాలీవుడ్ భ‌రించ‌లేద‌న్నందుకు..!

By:  Tupaki Desk   |   12 May 2022 4:33 AM GMT
మ‌హేష్ త‌న‌ను బాలీవుడ్ భ‌రించ‌లేద‌న్నందుకు..!
X
మీడియా ముందు ఏ అభిప్రాయం చెప్పినా ఆలోచించుకుని చెప్పాల్సిన స‌న్నివేశం ఉంది. ఒక్కోసారి కొన్ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు వివాదాల‌కు దారి తీస్తుంటాయి. ఫోక‌స్ ఎక్కువ‌గా ఉండే స్టార్ల‌ విష‌యంలో అయితే ఇది మ‌రీ ఎక్కువ‌. ఇక నేష‌న‌ల్ మీడియా అటెన్ష‌న్ ని డ్రాగ్ చేసే సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో బిగ్ డిబేట్ కి తెర తీసింది. మ‌హేష్‌ బాలీవుడ్ లో అరంగేట్రం చేయడం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుండి తనకు చాలా ఆఫర్లు వచ్చాయని అయితే వారు తనను భరించలేరని భావిస్తున్నట్లు ఆయ‌న వ్యాఖ్యానించారు.

తెలుగు ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలి మరో పరిశ్రమకు వెళ్లాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ఇక్క‌డ‌ పనిచేయడం తనకు ఎప్పుడూ సౌక‌ర్య‌మ‌ని మహేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఇదే విషయమై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్ మహేష్ పై విమర్శలు గుప్పించారు.

ఓ ప్ర‌ముఖ‌ మీడియా ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ-``బాలీవుడ్ మహేష్ బాబు రేట్ ను భరించలేకపోతే అది చాలా మంచిది. ఆయనకు నా శుభాకాంక్షలు. అతను ఎక్కడ నుండి వచ్చాడో నేను గౌరవిస్తాను. చ‌క్క‌ని ప్రతిభావంతుడు. సంవత్సరాలుగా సృష్టించిన ప్రతిభకు X విలువను కలిగి ఉన్నాడు`` అని అన్నారు.

మహేష్ చాలా విజయవంతమైన నటుడు. సినిమాల పరంగా అతను ఏమి పొందాలనుకుంటున్నాడో అది సాధించుకుంటూ అతని అవసరాలకు అనుగుణంగా ఉంటాడు. బాలీవుడ్ అతని అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోతే దానిలో తప్పు లేదు. ఆయనకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కటి దానిక‌దే యూనిక్`` అని అన్నారు.

ఈ విష‌యం మీడియాలో వైర‌ల్ గా మారింది. దాంతో మహేష్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తనకు సినిమా అంటే ఇష్టమని అన్ని భాషలను గౌరవిస్తానని మహేష్ స్పష్టం చేశారు. త‌న ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు చాలా సౌక‌ర్యంగా ఉంటుంద‌ని కూడా మ‌హేష్ అన్నారు. మహేష్ నటించిన‌ `సర్కార్ వారి పాట` ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలో భారీ వ‌సూళ్ల‌ను కొల్ల‌గొడుతుంద‌ని అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ‌హేష్ కొంత‌కాలంగా ప్ర‌మోష‌న్స్ ప‌రంగా మీడియా ఇంట‌రాక్ష‌న్స్ తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.