Begin typing your search above and press return to search.
8 ఏళ్లు ఖాళీగా లేను కదా అంటున్నాడు
By: Tupaki Desk | 20 Jun 2016 5:30 PM GMTవారసత్వం అన్నిసార్లు వర్కవుట్ కాదని చెప్పడానికి వర ముళ్లపూడి ఒక ఎగ్జాంపుల్. ముళ్లపూడి వెంకటరమణ కుమారుడైనా.. సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటివరకూ ప్రభావం చూపలేకపోయాడు. తొలిసినిమానే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన సక్సెస్ సాధించలేకపోయిన ఈ దర్శకుడు.. ఆ తర్వాత మళ్లీ మూడేళ్లకు విశాఖ ఎక్స్ ప్రెస్ తో ఇంకో ఫ్లాప్ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా 8 ఏళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కె.రాఘవేంద్ర రావు పేరు సమర్పణలో ఉన్నా కూడా కుందనపు బొమ్మ చిత్ర విడుదలకు బాగా ఆలస్యమే జరిగింది. ఎట్టకేలకు ఓ మాంచి తెలుగు నేటవిటీ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు వర ముళ్లపూడి హ్యాపీగానే ఉన్నాడు. అయితే.. తన గత చిత్రం.. ఈ మూవీ విడుదలకు మధ్యలో 8 ఏళ్లు గ్యాప్ ఉన్నా.. తానేం ఖాళీగా లేనని చెబుతున్నాడీయన. అటు టీవీ సీరియల్స్ తో పాటు.. ఇటు యాడ్ షూట్స్ కూడా చేసుకుంటున్నానని అన్నాడు వర.
టీవీ సీరియల్స్ లో అయితే ప్రతీదీ డీటైల్డ్ గా చూపించాలని.. సినిమాలో అయితే డ్రామా కూడా కావాలని.. అదే యాడ్ లో అయితే 30 సెకన్లలోనే షూటింగ్ మొత్తం చేసేయాలని.. వివిధ రంగాలపై తన ఒపీనియన్ ని వివరించాడు వర ముళ్లపూడి. కీరవాణి మ్యూజిక్ ఇవ్వడంతో.. కుందనపు బొమ్మపై టాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. వీటిని చేరుకునేందుకు కుందనపు బొమ్మ కష్టపడుతుందో.. తేలిగ్గానే అందుకుంటుందో?