Begin typing your search above and press return to search.
బాపు ప్రేమకథను అల్లుడు తెరకెక్కిస్తాడట
By: Tupaki Desk | 21 Jun 2016 1:30 PM GMTముళ్లపూడి రమణ లాంటి లెజెండరీ రైటర్ కొడుకుగా పుట్టడం ఎంత అదృష్టం..? అలాగే దిగ్గజ దర్శకుడు బాపు అల్లుడు కావడం ఇంకెంత అదృష్టం..? ఈ రెండు అదృష్టాలూ ఒకే వ్యక్తికి కలిగాయి. అతనే వర ముళ్లపూడి. వర రమణ గారి కొడుకన్న సంగతి జనాలకు తెలుసు కానీ.. బాపు అల్లుడన్న సంగతి చాలామందికి తెలియదు. ఐతే ఇంత గొప్ప బ్యాగ్రౌండ్ తో సినీ రంగంలోకి వచ్చినా.. దర్శకుడిగా విజయవంతం కాలేకపోయాడు వర. నా అల్లుడు.. విశాఖ ఎక్స్ ప్రెస్.. ఇలా ఆయన తీసిన రెండు సినిమాలూ డిజాస్టర్లే. ఇప్పుడు ‘కుందనపు బొమ్మ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వర.
ఈ సినిమాకు తన మావయ్య బాపూనే స్టోరీ బోర్డ్ వేస్తానని చెప్పారని.. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేకపోయారని.. అలాగే బాపు సిద్ధం చేసుకున్న ఓ ప్రేమకథను తాను తెరకెక్కించబోతున్నానని చెప్పాడు. ‘‘కుందనపు బొమ్మ కథ సిద్ధం చేసే సమయానికి నాన్న లేరు. బాపు గారికి కథ వినిపించాను. కొన్ని సలహాలు తీసుకున్నాను. స్టోరీ బోర్డు వేసిస్తానని మాట ఇచ్చారు. కానీ అంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ‘గోరంత దీపం’ సినిమా కోసం బాపు గారు ఓ పాట రికార్డు చేయించుకున్నారు. కానీ వాడలేదు. ఆయన అనుమతితో ఆ పాటని రీమిక్స్ చేసి మా సినిమాలో పెట్టాం. ఆ పాటను తెరకెక్కించే విషయంలోనూ బాపు సలహాలిచ్చారు. శ్రీరామరాజ్యం కంటే ముందు నాన్నగారు - బాపు గారు ఓ ప్రేమకథ తెరకెక్కించాలనుకున్నారు. కానీ దాన్ని మధ్యలోనే వదిలేశారు. ఆ కథను ఇప్పుడు నేను తెరకెక్కించబోతున్నాను’’ అని వర వెల్లడించాడు.