Begin typing your search above and press return to search.

అంచనాలు ఉన్నా.. షోలు పడ్డం లేదు..

By:  Tupaki Desk   |   25 Feb 2016 3:30 PM GMT
అంచనాలు ఉన్నా.. షోలు పడ్డం లేదు..
X
ఈ శుక్రవారం టాలీవుడ్ లో చిన్న సినిమాలకు పెద్ద పండగ అని చెప్పాలి. ఒకేసారి 8 సినిమాలు విడుదలవుతుండడం, అందులో మంచి అంచనాలున్నవి కూడా కొన్ని ఉండడంతో.. రిజల్ట్ పై ఆసక్తి బాగానే ఉంది. అయితే.. ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న రేంజ్ లో ప్రదర్శనలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ప్రస్తుతం సినిమాలకు సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్ లో ఎన్ని షోలు పడుతున్నాయనే విషయం కూడా చాలా ముఖ్యం. అయితే క్షణం, పడేశావే లాంటి మూవీస్ కి హైప్ తోపాటు అంచనాలు కూడా ఉన్నాయి. కానీ వీటిని నమ్ముకుని.. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న మూవీస్ ని రీప్లేస్ చేసేందుకు మల్టీప్లెక్స్ లు సిద్ధపడ్డం లేదు. మార్నింగ్ షోస్ విషయంలో ఇప్పటికీ నాగార్జున మూవీ సోగ్గాడే చిన్ని నాయన, నాని సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధల డామినేషన్ ఎక్కువగానే కనిపిస్తోంది. వీకెండ్స్ లోనే కాకుండా.. వీక్ డేస్ లో కూడా ఉదయం షోలకు ఈ సినిమాలకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

వీటి స్థానంలో కొత్త సినిమాలను ప్రదర్శించడాన్ని రిస్క్ అని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అనుకుంటున్నాయి. ఒకవేళ విడుదలయ్యాక టాక్ బాగుండి.. సినిమా పర్లేదనిపిస్తే.. అపుడు వీకెండ్స్ నుంచి షోస్ సంఖ్య పెంచాలని అనుకుంటున్నారు. ఇలా కౌంట్ పెరిగితే తప్ప.. ఈ సినిమాలు పాజిటివ్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఏమైనా.. రిజల్ట్ తెలిసేందుకు మరికొన్ని గంటలే టైం ఉంది కదా.