Begin typing your search above and press return to search.
2022లో ఎక్కువమంది సినిమాలు చూసే రోజు?
By: Tupaki Desk | 14 Sep 2022 3:30 AM GMTపెద్ద సినిమాలకు రూ.350-375 మధ్య టికెట్ ధర చెల్లించి మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అంటే.. ప్రస్తుత సన్నివేశంలో మధ్యతరగతికి అది తలకుమించిన భారం అవుతోందని విశ్లేషిస్తున్నారు. సినిమా వ్యూవర్ ని థియేటర్లకు రప్పించేందుకు టికెట్ ధరలు తగ్గాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కానీ భారీ సినిమాలను రిలీజ్ చేయాలంటే టికెట్ ధరల్ని పెంచుకునే సాంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడిచిపెట్టడం లేదు. అధిక ఆదాయం ఉండే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు ధీటుగా అల్పాదాయ వర్గాలు నివశించే చోట వసూల్ చేయాలన్న ఫార్ములాను మార్చే ఆలోచనలో ఎవరూ లేరు. సినిమా కోసం థియేటర్లకు వచ్చేవారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నమే లేదు.
ఇకపోతే 2022లో అత్యుత్తమంగా ప్రజలు థియేటర్లకు వెళ్లిన ఒక రోజు గురించి చెప్పాల్సిందిగా కోరితే ... కచ్ఛితంగా ఆ డేట్ సెప్టెంబర్ 23 అవుతుందని చెబితే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ రోజు
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ. 75 ధరతో (1టికెట్) సినీ ప్రేమికులను థియేటర్లకు రప్పించేందుకు ప్లాన్ లో ఉంది.
అమెరికా తరహాలోనే.. భారతదేశంలోని థియేటర్లు కూడా జాతీయ సినిమా దినోత్సవాన్ని రూపొందించే లక్ష్యంతో ఇలా ప్లాన్ చేయడం ఆసక్తికరం. ఇక్కడ సినీ ప్రేమికులు తమకు నచ్చిన చిత్రాలను పెద్ద స్క్రీన్ పై అద్భుతంగా తగ్గించిన ధరలలో చూసేలా చేయాలనేది ప్లాన్. ముందుగా సెప్టెంబర్ 16న ఇది జరగాల్సి ఉండగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సినిమా దినోత్సవ వేడుకల తేదీని మార్చినట్లు ప్రకటించింది. ఇది ఇప్పుడు సెప్టెంబర్ 23 కి వాయిదా పడింది.
ఈ నెల ప్రారంభంలో సెప్టెంబర్ 3న అమెరికా జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించింది. సినీప్రియులు పెద్ద స్క్రీన్ పై సినిమాలను ఆస్వాధించడానికి కేవలం 3డాలర్లు మాత్రమే చెల్లించారు. AMC - రీగల్ సినిమాల ప్రధాన చైన్ సహా 3000 కంటే ఎక్కువ థియేటర్లలో 30000 కంటే ఎక్కువ స్క్రీన్ లపై దేశవ్యాప్తంగా ఒకరోజు ఇలా షోలు వేసారు. ఇది పెద్ద సంఖ్యలో ప్రజల్ని ఇండ్ల నుంచి బయటకు వచ్చేలా చేసింది.
భారతదేశంలో కూడా ఇలా చేయాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తోంది. ముందుగా ఇది సెప్టెంబర్ 16న జరగాల్సి ఉండగా అసోసియేషన్ జాతీయ సినిమా దినోత్సవ వేడుకల తేదీని మార్చినట్లు ప్రకటించింది. తాజా సమాచారం మేరకు సెప్టెంబర్ 23 న దీనిని ప్లాన్ చేశారు. ఆరోజు కేవలం రూ.75 కే సినిమా వీక్షణ అవకాశం కల్పిస్తున్నారు. ఆరోజంతా బ్రహ్మాస్త్ర- అవతార్- చుప్ -ధోఖా వంటి చిత్రాలతో పాటు ప్రధాన సౌత్ రిలీజ్ లు ఈ తగ్గింపు వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని భావిస్తున్నారు.
భారతదేశం అంతటా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) మరియు థియేటర్ సంఘాలు జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా ప్రేక్షకులు రూ.75 సెలబ్రేటరీ అడ్మిషన్ ధరతో థియేటర్ల వద్ద ఒక రోజు గడపాలని స్వాగతించారు. PVR- INOX- Cinepolis- Carnival- MIRA- Citypride- ASIAN- Mukta A2- Movie Time- Wave- M2K - Delite వంటి థియేటర్ చైన్ లు సహా 4000 కంటే ఎక్కువ స్క్రీన్ లు జాతీయ సినిమా దినోత్సవ వేడుకలలో పాల్గొంటాయని ఈ ప్రకటన పేర్కొంది.
సినిమా థియేటర్ లను విజయవంతంగా పునఃప్రారంభించడాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజుగా దీనిని పేర్కొంటూ ప్రేక్షకులకు సదరు అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 1 (ఏప్రిల్ లోపు)లో సినిమాలు బాగా ఆడాయి. ఈ త్రైమాసికంలో KGF-2- RRR- విక్రమ్- భూల్ భూలయ్య 2 -హాలీవుడ్ హిట్‌లైన డాక్టర్ స్ట్రేంజ్ - టాప్ గన్ మావెరిక్ వంటి చిత్రాలు అద్భుతంగా ఆడాయి.
యాధృచ్ఛికంగా US నేషనల్ సినిమా డేలో 8.1 (81లక్షలు) మిలియన్ల మంది ప్రజలు సినిమాలను చూసారు. ఇది సెప్టెంబర్ 2 కంటే ఒక మిలియన్ ఎక్కువ.. సెప్టెంబరు 4 కంటే 1.7 మిలియన్లు ఎక్కువ మంది థియేటర్లకు వచ్చినట్టు రికార్డుల్లో నమోదైంది. జాతీయ సినిమా దినోత్సవం రోజున వీక్షణను పరిశీలిస్తే.. 2022లో ఏ ఇతర రోజుతో పోల్చినా దీనికి సరి తూగలేదు. థియేటర్ లకు అత్యధిక జనాలను తీసుకువచ్చిన రోజు అది. అలాగే భారతదేశంలోనూ సెప్టెంబర్ 23 అలాంటి ఒక అందమైన రోజుగా మారాలని ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను మల్టీప్లెక్సుల్లో ఇలాంటి టికెట్ ధరలను ప్రజలు ఆశిస్తున్నారు. వినోదం కోసం భారీ మొత్తాలను వెచ్చించేందుకు ఇప్పటి మనుగడలో కష్టతరంగా ఉందని కూడా విన్నవిస్తున్నారు. ఇకపై తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకో పక్షానికో ఇలాంటి ఒక రోజు వస్తే బావుంటుందని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.