Begin typing your search above and press return to search.
ఆ ప్రశ్న మాత్రం అడగొద్దన్న ముమైత్
By: Tupaki Desk | 24 Jan 2018 7:20 AM GMTపోకిరి సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు' పాటతో వయసుతో సంబంధం లేకుండా అందరిని తన ఫాన్స్ గా మార్చుకుని అది విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన ముమైత్ ఖాన్ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం బొత్తిగా తగ్గించేసింది. పోకిరి టైంలో అవకాశాలు వెల్లువలా రావడం - తనను లీడ్ రోల్ లో పెట్టి మైసమ్మ ఐపిఎస్ - మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి సినిమాలు చేసే రేంజ్ కు చేరుకున్న ముమైత్ ఆ తర్వాత సహజంగానే పెరిగిన పోటీ వల్ల మెల్లగా తప్పుకోవడం మొదలు పెట్టింది. లాస్ట్ ఇయర్ జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించిన బిగ్ బాస్ షోలో ఒక పార్టిసిపెంట్ గా టీవీలో రీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ సరిగ్గా అదే సమయం డ్రగ్స్ కేసు విషయమై అందులో తన పేరు కూడా ఉండటం పట్ల చాలా ఇబ్బందులే ఎదుర్కుంది.
ఇటీవలే జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో యాంకర్ తనను ఇదే విషయమై ప్రశ్నిస్తూ మీ పేరు మాత్రమే ఇందులో ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ముమైత్ సీరియస్ గా ఇలాంటి పనికిరాని పిచ్చి ప్రశ్న మరోసారి అడగకండి అని కాస్త ఘాటుగానే చెప్పింది. తన తప్పు లేకపోయినా, తన ప్రమేయం ఉన్నట్టు ఋజువులు ఏవి లేకపోయినా కేవలం అనుమానితుల లిస్టులో పేరున్న ఒకే ఒక్క కారణం చేత తాను మానసికంగా చాలా నరకం చూశానని - మరోసారి ఆ విషయం తన దగ్గర అడగకండని గట్టిగా చెప్పేసింది.
ముమైత్ తో పాటు అప్పట్లో రవితేజ - పూరి జగన్నాధ్ - నవదీప్ - ఛార్మీ తదితరులతో సిట్ టీం డ్రగ్స్ విషయమై ప్రత్యేక విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వాటి ఫలితాలు ఎందుకు బయటికి రాలేదు అనేది డిపార్టుమెంటుకు సంబంధించిన అంతర్గత విషయమైనా అప్పుడు సిట్ ఆఫీస్ కు వచ్చిన ప్రతి ఒక్క టాలీవుడ్ యాక్టర్ మీద రకరకాల కథనాలు వెలువడ్డాయి. ముమైత్ గాయాన్ని రేపొద్దు అని చెప్పడం న్యాయమే. ఇంకాస్త విశిదీకరించి అసలు ఇలా ఎందుకు జరిగింది అనే దాని గురించి కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసుంటే బాగుండేది కదా.