Begin typing your search above and press return to search.
బాలయ్య కోసం నెంబర్ వన్ ఐటెం భామ
By: Tupaki Desk | 22 Dec 2015 9:30 AM GMTముమైత్ ఖాన్.. జ్యోతి లక్ష్మి - జయమాలినిల తర్వాత తెలుగులో ఐటెం భామగా అంత గుర్తింపు తెచ్చుకున్న ముంబయి భామ. ఇప్పటికింకా నా వయసు.. పుష్కరం కిందట తెలుగు ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేసిన ముమైత్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఐటెం పాటలతో డ్యాన్స్ ఫ్లోర్లను హీటెక్కించేసింది. ఐతే గత మూడు నాలుగేళ్లుగా ఈ భామ అడ్రస్ లేకుండా పోయింది. తెలుగు ప్రేక్షకులు తనను పూర్తిగా మరిచిపోయిన ఈ టైంలో ముమైత్ మళ్లీ ఓ పెద్ద సినిమాలో స్టార్ హీరోతో కలిసి స్టెప్పులేయబోతున్నట్లు సమాచారం.
బాలయ్య సినిమా ‘డిక్టేటర్’లో ముమైత్ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఐటెం సాంగ్ కి ముందు నయనతారను అనుకున్నారు. తర్వాత శ్రద్ధా దాస్ ఈ పాట చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే తాజా కబురు ఏంటంటే.. ఒకప్పుడు నెంబర్ వన్ ఐటెం భామగా ఓ వెలుగు వెలిగిన ముమైత్ తోనే ఈ పాట చేయిస్తారట. ఈ బుధవారం నుంచే హైదరాబాద్ లో ఈ పాటను చిత్రీకరిస్తారట. ఈ పాటతో ‘డిక్టేటర్’ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి జనవరి 14నే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తారని సమాచారం.