Begin typing your search above and press return to search.
ముమైత్.. 22రోజులు..1000 మైళ్లు
By: Tupaki Desk | 8 Sep 2015 8:16 AM GMTఇప్పటికింకా నా వయసు నిండా పదహారే .. ఇప్పటికీ యువతరం చెవుల్లో సుడులు తిరిగే సాంగ్ ఇది. ఈ పాట వినగానే వెంటనే ముమైత్‌ఖాన్ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ ఒక్క ఐటెమ్ తో టాలీవుడ్ ని ఏలింది ఈ అమ్మడు. దాదాపు దశాబ్ధం పాటు ఐటెమ్ భామగా, కథానాయికగానూ నటించి మెప్పించింది. సిల్కుస్మిత, జ్యోతిలక్ష్మి తర్వాత మళ్లీ ఆ రేంజు ఐటెమ్ భామగా పాపులారిటీ తెచ్చుకుంది.
ఇప్పటికైతే ముమైత్ సినిమాల్లేక ఖాళీగానే సమయాన్ని టైమ్ పాస్ చేస్తోంది. మరీ ఇలా సెలబ్రిటీ ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల తనని అంతా మర్చిపోతారని భావించిందో ఏమో! ఇప్పుడు ఏకంగా ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసింది. 22రోజుల పాటు సాగే ఈ ట్రిప్ లో మొత్తం 1000 మైళ్లు ప్రయాణిస్తుంది. ఈ రోడ్ ట్రిప్ ఆద్యంతం ఎంతో హుషారుగా సాగుతుంది.
మ్యూజిక్, డ్యాన్సింగ్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా దారిపొడవునా ఎంతో హుషారుగా ఉంటుందని ముమైత్ చెప్పింది. ఫిలడెల్ఫియా నుంచి తంపా బే వరకూ సాగించే ఈ పయనంలో మధ్యలో మ్యూజిక్ ఫెస్టివల్స్ లో స్నేహితుల్ని కలుస్తుంది. సంగీతానికి సరికొత్త ప్రచారం తీసుకురావడమే దీని ప్రధాన ఉద్ధేశం అని చెప్పింది. సినిమాలు ఎలానూ లేవు. కనీసం పాప్ స్టార్ గా అయినా పాపులర్ అవ్వాలన్నది తన ఆలోచన అయ్యి ఉంటుంది.