Begin typing your search above and press return to search.

షాకింగ్: తింటూ త‌గ్గిన ముమైత్‌!!

By:  Tupaki Desk   |   14 April 2018 9:23 AM GMT
షాకింగ్: తింటూ త‌గ్గిన ముమైత్‌!!
X
ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే... అంటూ ముమైత్ ఖాన్ చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. పోకిరి సినిమా త‌ర్వాత కొన్నాళ్లు ఆమె ప్ర‌తీ పెద్ద‌ సినిమాలోనూ క‌నిపించింది. అయితే వ‌చ్చిన క్రేజ్ ను నిల‌బెట్టుకోవ‌డంలో త‌ప్ప‌ట‌డుగు వేసి క‌నుమ‌రుగైంది. గ‌త ఏడాది డ్ర‌గ్స్ కేసుతో మ‌ళ్లీ క‌నిపించిన ముమైత్‌... బిగ్ బాస్ లో పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేసేసింది. ఇప్పుడు బ‌రువు త‌గ్గి స్లిమ్ గా షాకింగ్ లుక్కులో ద‌ర్శ‌న‌మిస్తోందీ ఐట‌మ్ గ‌ర్ల్‌.

రెండేళ్ల క్రితం... త‌ర్వాత అంటూ రెండు ఫోటోల‌ను జోడించి ఇన్ స్ట్రాగ్రామ్ పోస్టు చేసిన ముమైత్ కొన్ని షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌టపెట్టింది. త‌న‌కు మూర్చ వ్యాధి ఉంద‌ని చెప్పిన ముమైత్‌... దాని కోసం వాడుతున్న మాత్ర‌ల వ‌ల్ల చాలా లావైపోయాన‌ని బ‌య‌టపెట్టింది. అంతేకాకుండా రెండేళ్ల క్రితం బ‌రువులు ఎత్త‌కూడ‌ద‌ని డాక్ట‌ర్ చెప్ప‌డం వ‌ల్ల స‌రైన వ్యాయ‌మం లేక ఇలా బ‌రువు పెరుగుతూ పోయాన‌ని చెప్పిన ముమైత్‌... అయినా తానెప్పుడు బాధ‌ప‌డ‌లేద‌ని బ‌రువు త‌గ్గ‌డం ఎలాగో త‌న‌కు తెలుసున‌ని చెప్పింది. ఫిట్ మీల్స్ ఇండియా వాళ్లు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటించి ఎటువంటి వ్యాయ‌మం లేకుండానే బ‌రువు త‌గ్గాన‌ని చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్‌. కార్భో హైడ్రెడ్లు త‌క్కువ‌గా... పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకుంటూ రోజుకి 8 గంట‌ల నిద్ర‌పోతే ఎటువంటి ఆరోగ్య మాన‌సిక స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వంటూ స‌ల‌హాలిచ్చింది.

ఈ రెండేళ్ల ప్ర‌యాణంలో ఎదుటి వాళ్లు నీ నుంచి ఏది ఆశిస్తున్నారో... అది మాత్రం ప‌ట్టించుకోకూడ‌ద‌ని తెలుసుకున్నాన‌ని ఫిలాస‌ఫీ చెప్ప‌డం మొద‌లెట్టింది ముమైత్ ఖాన్‌. కొద్ది కాలంగా ముమైత్ ఫేస్ చేసిన ప‌రిస్థితుల‌ను చూస్తే ఈ మాత్రం ఫిలాస‌ఫీ వంట‌బ‌ట్ట‌డం స‌హ‌జ‌మే అంటున్నారు నెటిజ‌న్లు. అన్నింటినీ దాటుకుంటూ ముమైత్‌... ఇలా మారిపోవ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌య‌మే. ఇప్పుడు కొత్త లుక్కులో క‌వ్విస్తున్న ముమైత్ కి మ‌ళ్లీ అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తాయేమో చూడాలి.