Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నుంచి ముమైత్ బ‌య‌టికి..

By:  Tupaki Desk   |   26 July 2017 4:06 PM GMT
బిగ్ బాస్ నుంచి ముమైత్ బ‌య‌టికి..
X
ఆల్రెడీ జ్యోతి ‘బిగ్ బాస్’ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సంపూర్ణేష్ బాబు త‌నంత‌ట తానుగా ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. ఇంకా వీకెండ్ కూడా రాకుండానే ముమైత్ ఖాన్ కూడా బ‌య‌టికి వ‌చ్చేయ‌డ‌మేంటి అంటారా? ఇది ఎలిమినేష‌నూ కాదు.. ఆమె షో నుంచి త‌ప్పుకోవ‌డ‌మూ లేదు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆమె హౌస్ నుంచి బ‌య‌టికి రాబోతోంది. మ‌ళ్లీ ఆమె హౌస్‌ లోకి తిరిగెళ్తుంది కూడా.

డ్ర‌గ్స్ కేసులో సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న వాళ్ల‌లో ముమైత్ ఖాన్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆమె పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. ఒక‌సారి ‘బిగ్ బాస్’ హౌస్‌ లోకి వెళ్లాక ఎలిమినేట్ అయితే త‌ప్ప బ‌య‌టికి రావ‌డం ఉండ‌దు. ఒక‌సారి బ‌య‌టికి వ‌చ్చాక మ‌ళ్లీ లోప‌లికి వెళ్ల‌డ‌మూ ఉండ‌దు. కానీ ముమైత్ కోసం నిబంధ‌న‌లు స‌డ‌లిస్తున్నారు. ఆమెకు ప్ర‌త్యేక అనుమ‌తి ఇచ్చి బ‌య‌టికెళ్లి మ‌ళ్లీ లోప‌లికొచ్చే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు.

ముమైత్ గురువారమే సిట్ అధికారుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. ఆమె బుధ‌వారం రాత్రి బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి రానున్న‌ట్లు స‌మాచారం. విచార‌ణ ముగియ‌గానే గురువారం సాయంత్రం తిరిగి పుణెకు వెల్లిపోయి ‘బిగ్ బాస్’ హౌస్‌ లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది. కాబ‌ట్టి ఒక రోజంతా ముమైత్ హౌస్‌ లో ఉండ‌దు. ఒక ఎపిసోడ్లో త‌ను క‌నిపించ‌దు. మ‌రి బ‌య‌టికొచ్చి షోకు సంబంధించి సోష‌ల్ మీడియాలో రెస్పాన్స్.. కామెంట్లు అన్నీ చూసి బ‌య‌టి సంబంధంతో క‌నెక్ట‌యితే ముమైత్ ప్ర‌వ‌ర్త‌న మారిపోతుందేమో క‌దా.