Begin typing your search above and press return to search.

ముమైత్ ఖాన్ కు పర్మిషన్ దొరికిందట

By:  Tupaki Desk   |   22 July 2017 12:05 PM GMT
ముమైత్ ఖాన్ కు పర్మిషన్ దొరికిందట
X
స్టార్ మా టీవీ ప్రెస్టీజియస్ గా టెలికాస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాం ఈమధ్యనే స్టార్ట్ అయింది. కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లో పెట్టి ఇప్పటికే తాళం వేశారు. 70 రోజుల పాటు వారంతా ఒకేచోట గడపవలసి ఉంటుంది. వీరి కదలికలను కెమెరాలు నిశితంగా గమనిస్తూ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా కంటెస్టెంట్లలో ఐటం సాంగ్ గర్ల్ ముమైత్ ఖాన్ కూడా ఉండటం ఈ ప్రోగ్రాంపై ఆసక్తి పెంచింది. ఆ ఆసక్తి పెంచింది బిగ్ బాస్ లో ఆమె పెర్ఫార్మెన్స్ కాదు. బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లేపాటికి టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ మేటర్ లో ముమైత్ ఖాన్ పేరు బయటకు రావడం.

ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ డ్రగ్స్ కేసును డీల్ చేయడం మొదలెట్టినప్పటి నుంచి ఈ వ్యవహారం మరింత రంజుగా మారింది. తాము నోటీసులు ఇచ్చిన వారందరూ విచారణకు హాజరు కావాల్సిందేనని అకున్ సబర్వాల్ తెగేసి చెప్పాక. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారు బయటకు వచ్చే అవకాశం లేదు. బయటున్న వారు లోపలకు వెళ్లే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ముమైత్ ను ఎలా విచారణ చేస్తారా అని పలు డౌట్లు వచ్చాయి. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ఈనెల 27న విచారణకు హాజరు అవుతానంటూ ముమైత్ ఖాన్ అకున్ సబర్వాల్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. విచారణకు హాజరు అయ్యేందుకు బిగ్ బాస్ నుంచి ఈ మేరకు ఆమె పర్మిషన్ దొరికింది.

బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఎలిమినేట్ అవకముందే స్పెషల్ పర్మిషన్ తో ఒకళ్లు బయటకు రావాల్సి వస్తుందని ఆ ప్రోగ్రాం డిజైనర్లు కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ తోపాటు ఆయన చుట్టూ ఉన్నవారిపై నోటీసులు జారీ చేయడం మొదలుకొని ఎన్నో సెన్సేషన్స్ వెలుగులోకి వస్తున్నాయి. చూద్దాం ముందుముందు ఇంకెన్ని సెన్సేషన్స్ వెలుగులోకి వస్తాయో..