Begin typing your search above and press return to search.

ఆమె వ‌ల్ల స‌ఖుడికి విరహ వేద‌న రాత్రులు!

By:  Tupaki Desk   |   6 Aug 2021 11:30 AM GMT
ఆమె వ‌ల్ల స‌ఖుడికి విరహ వేద‌న రాత్రులు!
X
ముంబై బ్యూటీ కియారా అద్వాణీ తెలుగు...హిందీ భాష‌ల్లో బిజీ నాయిక‌గా కెరీర్ ని సాగిస్తోంది. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న ఛాన్స్ లు అందుకుంటూ హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. ఇటీవ‌లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రంలో హీరోయిర్ గా ఎంపికైంది. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ సినిమా కావ‌డంతో కియ‌రా అవ‌కాశాన్ని జార‌విడిచేందుకు సిద్ధంగా లేద‌ని ప్ర‌చార‌మైంది.

కియ‌రా మ‌రోవైపు బాలీవుడ్ లోనూ త‌న‌దైన మార్క్ స్పీడ్ చూపిస్తోంది. వెండి తెర తో పాటు డిజిట‌ల్ తెర‌పైనా వెలుగుతోంది. వెబ్ సిరీస్ ల్లోనూ విరివిగా అవ‌కాశాలు అందుకుంటూ స‌త్తా చాటుతోంది. మ‌రి ఇంత హ్యాపీగా ఉన్నా వృత్తిగ‌త కెరీర్ కోసం ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ ని ప‌క్క‌న‌బెడుతోందా? ప్రేమ‌..ప్రియుడి గురించి మాట్లాడితే త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తోందా? అంటే అవున‌నే అంటున్నాయి బీ-టౌన్ వ‌ర్గాలు.

కియారా అద్వాణీ కొన్నేళ్ల‌గా బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో పీక‌ల్లోతూ ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బ‌య‌ట‌కొచ్చాయి. ఇరువురు ఎంతో స‌న్నిహితంగా మెలుగుతున్న ఫోటోలు....ఇంటిమేట్ వీడియోలు మీడియాలో వైర‌ల్ అయ్యి హీటెక్కించాయి. మీడియా కంట ప‌డిన ప్ర‌తీ సారి ప్రియుడి గురించి ప్ర‌శ్నిస్తే అమ్మ‌డు ఏదోలా ఆన్స‌ర్ దాట‌వేసి జారుకుంటోంది. కేవ‌లం ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం త‌ప్ప ఇంకెలాంటి రిలేష‌న్ లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టేస్తోంది. కానీ కియ‌రా చెప్పేది వేరు.. చేసేదీ వేరుగా క‌నిపిస్తున్నాయ‌ని బాలీవుడ్ మీడియాలో మ‌రోసారి గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రి కియారా ఎందుకిలా చేస్తోంద‌నే ప్ర‌శ్నకు స‌మాధానం వేరుగా ఉంది. సినిమా అవ‌కాశాలు తగ్గుతాయ‌నే భావ‌న‌తోనే ప్రియుడిని హైడ్ చేస్తోంద‌నే క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ప్రేమ‌లో ఉన్న హీరోయిన్ల‌తో ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నే కార‌ణంగా ముందు జాగ్ర‌త్త‌గా కియారా అలాంటి వ్య‌వ‌హారాల‌కు దూర‌మంటూనే..తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రియుడితో చాటు మాటుగా నే ర‌హ‌స్య ప్రేమ కొన‌సాగితే అంద‌రికీ మంచిద‌ని భావించి ఇలా వ్య‌వ‌రిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వృత్తిగ‌త జీవితాన్ని వ్య‌క్తిగ‌త జీవితాన్ని మ్యానేజ్ చేయ‌డం క‌థానాయిక‌ల‌కు అంత ఈజీ కాద‌ని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.