Begin typing your search above and press return to search.
నెక్స్ట్ సీన్ బొంబాయ్ ముద్దుగుమ్మలదేనా?
By: Tupaki Desk | 23 Aug 2015 2:15 AM GMTటాలీవుడ్ హీరోయిన్ల ఫేసుల మీదికి టార్చ్ లైట్ వేసి వెతికితే... అందులో చెన్నయ్ చంద్రాలే ఎక్కువ. ముంబై నుంచి ఇంపోర్ట్ అస్సలు కనిపించదు. సమంత - అమలాపాల్ - రెజీన - త్రిష - శ్రుతిహాసన్ ఇంతమంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ ని ఏల్తున్నారు. వీళ్లంతా చెన్నయ్ నుంచి దిగుమతి అయినవారే. ఇలియానా, తమన్నా లాంటి రేర్ నేమ్స్ మాత్రమే సీనియర్లలో వినిపిస్తాయి. ఇప్పుడున్న నవతరం నాయికల్లో రాశీ ఖన్నా మాత్రమే ముంబై నుంచి వచ్చి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈవిడొక్కర్తే ఆర్థికరాజధాని నుంచి వచ్చి వెలుగుతోంది.
మరి నెక్స్ట్ జనరేషన్ స్టార్స్‌లో ముంబై నుంచి ఇంపోర్ట్ లేదా? అంటే ఉన్నారు. అయితే ఇప్పుడే కెరీర్ మొదలెట్టారు. అఖిల్ హీరోయిన్ సయేషా సైగల్ ముంబై పోరి. లోఫర్ వరుణ్ తేజ్ ప్యారీ దిశా పటానీ కూడా ముంబై నుంచే దిగొచ్చింది. నాగ శౌర్య సరసన ఫలక్ లల్వాణీ కూడా ముంబై ఇంపోర్ట్. ప్రస్తుతం వెలుగులో ఉన్నది ఈ ముగ్గురు భామలే. ఒకవేళ మొదటి సినిమాతోనే వీళ్లంతా హిట్లు కొడితే టాలీవుడ్ లో ఫేమస్ అయిపోతారు. వరుసగా అవకాశాలు క్యూ కడతాయి. అప్పుడు చెన్నయ్‌కి ధీటుగా ముంబై సరుకు కళకళలాడుతుందన్నమాట!