Begin typing your search above and press return to search.

కంగనాపై శివసేన ప్రభుత్వం ఎటాక్‌ షురూ

By:  Tupaki Desk   |   7 Sep 2020 5:31 PM GMT
కంగనాపై శివసేన ప్రభుత్వం ఎటాక్‌ షురూ
X
అధికారంలో ఉన్న పార్టీతో లేదా నాయకుడితో పెట్టుకుంటే ఏం జరుగుతోంది ఇప్పటికే పలువురికి అర్థం అయ్యింది. ఇప్పుడు కంగనాకు ఆ విషయం అర్థం అయ్యేలా ఉంది. సుశాంత్‌ మృతి విషయంలో కంగనా వ్యాఖ్యలు శృతిమించాయి. బాలీవుడ్‌ వారితో పాటు ముఖ్యమంత్రి తనయుడినే కంగనా టార్గెట్‌ చేసింది. శివసేన అధికారంలో ఉండటంతో ఇప్పుడు కంగనాను ట్రబుల్స్‌ వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆమెను ముంబయిలో అడుగు పెట్టనిచ్చేది లేదు అంటూ శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. దాంతో ఆమె శివసేన వారిని రెచ్చగొట్టేలా ఎవడి బాబు వచ్చి నన్న ఆపుతాడో చూస్తాను అంటూ తాను ముంబయి వచ్చే తేదీని చెప్పింది.

కంగనా ముంబయి రాక ముందే ఆమెకు సంబంధించిన ఆఫీస్‌ ను కూల్చి వేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ముంబయి మున్సిపల్‌ కార్పోరేషన్‌ వారు కంగనాకు చెందిన మణికర్ణిక ఫిలిమ్స్‌ కు చెందిన ఆఫీస్‌ అక్రమ కట్టడం అంటూ కూల్చి వేతకు సిద్దం అయ్యారట. నేడు ఆఫీస్‌ లోకి కొందరు బలవంతంగా చొచ్చుకు వెళ్లి నానా హంగామా చేశారట. ఈ విషయాలను కంగనా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది.

నా భవనం అక్రమ కట్టడం అయితే మొదట నోటీసులు ఇవ్వాలి ఆ తర్వాత ప్లాన్‌ నాకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి. కాని వారు మాత్రం రేపు కూల్చి వేస్తామని అంటున్నారని కంగనా ట్విట్టర్‌ లో పేర్కొంది. ప్రస్తుతం తన సొంత రాష్ట్రం అయిన హిమాచల్‌ ప్రదేశ్‌ లో కంగనా ఉంది. ఈనెల 9న ముంబయి వెళ్లనున్న కంగనాకు హిమాచల్‌ ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తామంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.