Begin typing your search above and press return to search.
సుశాంత్ : ముంబయి పోలీసులు అసలు విషయాలు దాస్తున్నారు
By: Tupaki Desk | 5 Sep 2020 12:50 PM GMTసుశాంత్ మృతి కేసు సీబీఐకి అప్పగించిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం ఖాయం. ఖచ్చితంగా అన్ని విధాలుగా సుశాంత్ ఫ్యామిలీకి న్యాయం జరగడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు. కాని సుశాంత్ కుటుంబ సభ్యుల తరపు లాయర్ వికాస్ సింగ్ వ్యాఖ్యలు చూస్తుంటే మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసి అతడిని రియా కుటుంబం లోబర్చుకుందా అనే అనుమానాలు గత కొన్న రోజులుగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో లాయర్ వికాస్ సింగ్ వ్యాఖ్యలు మరింత అనుమానాలను లేవనెత్తతున్నాయి.
రియా మరియు ఆమె సోదరుడికి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. వారికి ఇద్దరికి కూడా డ్రగ్స్ డీలర్ తో సంబంధాలు ఉన్నట్లుగా ఎంక్వౌరీలో వెళ్లడి అయ్యింది. రియా సోదరుడు శోవిక్ అరెస్ట్ మరియు సుశాంత్ ఇంటి మేనేజర్ అరెస్ట్ తో ఈ కేసు తప్పు దారి పడుతుందేమో అనే అనుమానాలు లాయర్ వికాస్ సింగ్ వ్యక్తం చేశారు. ఈ కేసులో సుశాంత్ కుటుంబ సభ్యులు న్యాయం కోరుతున్నారు. కాని ముంబయి పోలీసుల తీరు చూస్తుంటే మాత్రం ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వరుసగా అరెస్ట్ లతో సుశాంత్ కేసును తప్పుడు దారికి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ ముంబయి పోలీసులను వికాస్ సింగ్ ప్రకటించాడు. సీబీఐ వారికి సహకరించకుండా ఇష్టానుసారంగా ముంబయి పోలీసులు వ్యవహరిస్తున్నారు అనే వాదన వినిపిస్తుంది. ఈ సమయంలో లాయర్ వికాస్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశం అయ్యింది.