Begin typing your search above and press return to search.
పోలీసులను ఇరుకున పెట్టిన కంగనా
By: Tupaki Desk | 25 July 2020 5:30 AM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ మాఫియానే కారణం అంటూ కంగనా పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో ఇప్పటికే కొందరి పేర్లను ప్రస్థావించి వారిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాదాపుగా 40 మందిని విచారించారు. ఆత్మహత్య కేసులో ఇంకా పలువురిని ప్రశ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. కంగనా పదే పదే సుశాంత్ ఆత్మహత్యపై స్పందిస్తున్న కారణంగా ఆమెకు తెలిసిన విషయాలను రికార్డ్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
ముంబయిలోని కంగనా ఇంటికి పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించడం జరిగింది. అయితే కంగనా కరోనా కారణంగా ముంబయిని వదిలి మనాలీలో గత నాలుగు నెలుగా ఉంటుంది. ముంబయి ఇంటి వద్ద నోటీసులు తీసుకునేందుకు తిరష్కరించడంతో మనాలీకి నోటీసులను పోస్ట్ చేయడం జరిగింది. మనాలీలో ఉన్న కంగనా నోటీసులు అందుకుని ముంబయికి విచారణకు వచ్చేందుకు నో చెప్పిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముంబయికి కంగనా రాలేదని కావాలంటే ఒక టీమ్ ను మనాలీ పంపించడం కాని ఆన్ లైన్ ద్వారా ఆమెను విచారించడం కాని చేయాలంటూ కంగనా తరపు న్యాయవాది పోలీసుల నోటీసుకు సమాధానం ఇచ్చాడట.
సుశాంత్ ఆత్మహత్య కేసులో జుట్టు పీక్కుంటున్న పోలీసులు ఇప్పుడు కంగనా ఇష్యూతో మరింత ఇరకాటంలో పడ్డట్లుగా అయ్యింది. ఈ కేసుతో ఆమెకు సంబంధం లేకున్నా కూడా ఆమె పదే పదే సుశాంత్ ఆత్మహత్య విషయమై స్పందిస్తున్న కారణంగా పోలీసులు ఆమెను ప్రశ్నించాలనుకున్నారు. కాని ఇప్పుడు ముంబయిలో అందుబాటులో లేకపోవడం ఆమె విచారణ కోసం పోలీసులు పెద్ద తతంగమే నడపాల్సి ఉందని తల పట్టుకున్నారట.